విశ్వక్ సేన్ హీరోగా లైలా అనే సినిమా రూపొందింది. బట్టల రామస్వామి బయోపిక్ అనే సినిమా గతంలో డైరెక్ట్ చేసిన రామ్ నారాయణ ఈ లైలా సినిమా డైరెక్టర్ చేశాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో విశ్వక్సేన్ లేడీ గెటప్ లో నటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవిని ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ రావడం కంటే ముందు మాట్లాడిన నటుడు పృథ్వీరాజ్ కామెంట్స్ ఇప్పుడు వైసీపీ అభిమానులకు కోపం తెప్పించాయి.
Chiranjeevi : ఇండస్ట్రీలో ఉన్నది ఒక్కటే కాంపౌండ్.. మెగాస్టార్ అన్ని అనుమానాలు లేపేశాడుగా!
తాను ఈ సినిమాలో మేకల సత్తి అనే క్యారెక్టర్ చేశానని సినిమా ప్రారంభమైనప్పుడు మొత్తం 150 వరకు మేకలు ఉండేవి కానీ పూర్తయ్యే సమయానికి 11 మేకలు అయ్యాయి. ఇది యాదృచ్ఛికమో లేక కాకతాళీయమో ఏమో తెలియదు అంటూ పృథ్వీరాజ్ కామెంట్ చేశాడు. ఆయన అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఇలా కామెంట్ చేశాడంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. అంతే కాకుండా బాయ్ కాట్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ని కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఈ కొత్త తలనొప్పి రావడంతో విశ్వక్సేన్ ఈరోజు మధ్యాహ్నం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. మరోసారి మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడబోతున్నారు.