అనారోగ్య కారణాలతో.. గుంటూరులో సీఐడీ విచారణకు వర్మ హాజరు కాలేరని ఆయన తరపు న్యాయవాది నాని బాబు.. సీఐడీ పోలీసులకు సమాచారం ఇచ్చారు.. నేడు గుంటూరులో సీఐడీ కార్యాలయానికి వెళ్లిన వర్మ తరపు అడ్వకేట్.. సీఐడీ విచారణకు రావడానికి రామ్ గోపాల్ వర్మ కు 8 వారాల సమయం కావాలని కోరారు..
ఆర్జీవీ పై ఒంగోలు పోలీసులు సీరియస్ యాక్షన్ కు సిద్ధమయ్యారు. వర్మను అరెస్టు చేసి ఒంగోలు తీసుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. డిజిటల్ మోడ్ లో విచారణకు హాజరవుతానని ఆర్జీవీ రెక్వెస్ట్ చేసినా అవకాశం ఇచ్చేది లేదంటున్నారు. విచారణ అధికారిగా పోలీసులకు ఉన్న పవర్స్ దృష్ట్యా డిజిటల్ విచారణకు అంగీకరించమంటున్నారు. ఆయన కోరిన విధంగా రెండు సార్లు విచారణకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించినా ఆర్జీవీ సద్వినియోగం చేసుకోలేదంటున్నారు. పోలీసు అధికారుల నోటీసులు ధిక్కరించారు కాబట్టే చట్టప్రకారం…