గుంటూరు జిల్లాలో సంచలనం కలిగించిన బ్యాంక్ కుంభకోణంలో దర్యాప్తు వేగంగా సాగుతోంది. తెనాలి జీడీసీసీ బ్యాంక్ కుంభకోణంలో బ్యాంక్ మేనేజర్ నేతి వరలక్ష్మిని ప్రధాన సూత్రధారిగా నిర్ధారించారు బ్యాంకు ఉన్నతాధికారులు. ఉద్దేశ్య పూర్వకంగానే నకిలీ బంగారంతో రుణాలు ఇచ్చినట్లు గుర్తించిన అధికారులు చర్యలను వేగవంతం చేశారు.
రూ.44 లక్షల బ్యాంకు సొమ్మును నిందితులనుండి రికవరీ చేశారు అధికారులు. బ్యాంక్ మేనేజర్ ,అసిస్టెంట్ మేనేజర్ , క్యాషియర్ లపై సస్పెన్షన్ వేటు వేశారు ఉన్నతాధికారులు. మరో వైపు క్రిమినల్ చర్యలకు సిద్దమౌతున్నారు బ్యాంకు అధికారులు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో బ్యాంక్ ఉద్యోగులు చేతి వాటం ఖాతాదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.. కంచె చేను మేసిన చందంగా బ్యాంక్ ఉద్యోగులు బ్యాంకుల్నే మోసం చేస్తున్నారు. బ్యాంకులో నకిలీ బంగారం తాకట్టు పెట్టు కొని దొంగ రుణాలు మంజూరు చేశారు బ్యాంక్ ఉద్యోగులు… చెంచుపేట జీడీసీసీ బ్యాంక్ మేనేజర్ తో పాటు మరో ఇద్దరు సిబ్బంది ఐదుగురు ఖాతాదారుల సాయంతో లక్షలాది రూపాయలు స్వాహా చేశారు. ఆడిటింగ్ నిర్వహిస్తున్న సమయంలో విషయం తెలుసుకున్న బ్యాంక్ అధికారులు తనిఖీలు చేపట్టారు. బ్యాంకులో నకిలీ బంగారం పెట్టి మొత్తం 29 అకౌంట్లలో 42లక్షల రూపాయలు లోన్ తీసుకున్న ట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు.
బ్రాంచ్ మేనేజర్,తో పాటు బంగారం తనఖా పెట్టుకునే అధికారి(అప్లైజర్) కుమ్మక్కయి రుణాలు మంజూరు చేసినట్టు విచారణలో తేలింది. మరికొన్ని అకౌంట్లలో తక్కువ నాణ్యత కలిగిన బంగారం పెట్టి ఎక్కువ డబ్బు రుణాలుగా పొందటం కొన్ని కేసుల్లో బంగారం విలువ కంటే ఎక్కువ డబ్బు రుణం పొందారు. అవసరం కోసం భద్రత కోసం బ్యాంక్ లో బంగారం పెడుతుంటే బ్యాంక్ సిబ్బంది ఇలా మోసాలు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఖాతా దారులు. బ్యాంకు అధికారుల ప్రమేయంతోనే నకిలీ బంగారం పెట్టి లక్షల సొమ్ము కాజేస్తున్నారు. నకిలీ బంగారంతో లక్షలు లోన్లు తీసుకున్నవారిని కఠినంగా శిక్షించాలని ఖాతాదారులు కోరుతున్నారు.
Guntur Gold Scams: గోల్డ్ స్కాంలతో బ్యాంక్ ఉద్యోగుల చేతివాటం