Gudivada Amarnath: జనసేనాకు పదేళ్లుగా అజెండా లేదు.. ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాటల దాడిని ఉద్ధృతం చేశారు వైసీపీ నేతలు. పవన్ మచిలీపట్నం సభపై కౌంటర్లు ఇస్తున్నారు. మచిలీపట్నం సభలో మాట్లాడిన పవన్ వచ్చే ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన బలిపశువు కాబోదని, తాము ప్రయోగాలు చేయబోమని స్పష్టంచేశారు. శాసనసభలో అడుగుపెట్టేలాగే తమ ప్రణాళిక ఉంటుందని తెలిపారు. తన సహా పోటీ చేసే అభ్యర్థులంతా గెలిచే తీరాలన్నారు. తమ దగ్గర డబ్బుల్లేవు అని, మేం డబ్బులు పంచలేం. మీ ఓటు మీరే కొనుక్కుని మాకు ఓటేయండి అంటూ సభకు హాజరైన పార్టీ శ్రేణులు, మద్దతుదారులను ఉద్దేశించి ఆయన అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో జనసేనది బలమైన సంతకం ఉంటుందన్న పవన్… రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం అని చెప్పారు. ఈ క్రమంలో పవన్ ను వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. మాటల దాడికి పదను పెట్టారు.
Also Read: CM Jagan: ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే విడుదల
తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్.. పవన్ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ, పదేళ్ళ పాటు ఒక అజెండా లేకుండా నడిచిన పార్టీ జనసేన అని వ్యాఖ్యానించారు. రాజకీయ సిద్ధాంతం లేని పార్టీ జనసేన అని కామెంట్ చేశారు.తమ పార్టీ ఏం చేస్తుందో చెప్పకుండా గంటన్నర పవన్ మాట్లాడరని అన్నారు. పవన్ సభకు వచ్చిన కార్యకర్తలు చాలా అమయాకులు అని చెప్పారు. పవన్ కళ్యాణ్ బంకర్ టు బందర్ అంటూ మండిపడ్డారు. నెలన్నర రోజుల పాటు బంకర్ లో దాక్కున్నాడని ఆరోపించారు.
Also Read
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
- AP Govt: 18 ఏళ్లు నిండిన వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త.. రూ.2 లక్షల చొప్పున సాయం..
- Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
జెండా పవన్ ది అజెండా చంద్రబాబుదని ఆరోపించారు. పవన్ ప్రసంగం సారాంశం కాపు ఓట్లను చంద్రబాబుకు ఎలా ధారాదత్తం చేయలన్నదే అని చెప్పారు. అసెంబ్లీకి రావాలని ఉంటే ఎన్నికల వరకు ఆగటం ఎందుకు? అప్రశ్నించారు. కావాలంటే స్పీకర్ ని అడిగి రెండు పాస్ లు ఇస్తామని, వచ్చి అసెంబ్లీ చూసి వెళ్ళొచ్చు సెటైర్లు వేశారు. తెలంగాణ పోరాట స్ఫూర్తిని ఇక్కడ లేదంటున్నారని, మరి అక్కడే పోటీ చేయవచ్చు కదా అని సూటిగా ప్రశ్నించారు. ఉద్దేశంతో నిన్న సభ పెట్టారో పవన్‌కే తెలీదని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ కు 175కు 175 స్థానాల్లో పోటీ చేసే ధైర్యం లేదన్నారు. నీది కాపు జనసేన కాదు.. కమ్మ జనసేన అంటూ ఫైర్ అయ్యారు.
Also Read:Perni Nani: తొడలు కొట్టే రాజకీయం పవన్ కళ్యాణ్ దే.. అర్థరాత్రి మద్దెల దరువు
తాజావార్తలు
-
Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
-
Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!