IMD Alert: కోనసీమకు మరో ముప్పు.. అర్నబ్ వెనుకే మరో వాయుగుండం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న తుఫానులు, అల్పపీడనాలు కోనసీమ పరిసర ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే ‘అర్నబ్’ ప్రభావంతో పలు ప్రాంతాలు తేరుకోకముందే, మరో కొత్త వాయుగుండం తీరం వైపు దూసుకొస్తుండటం ఈ ప్రాంతానికి పెను ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో ఒక అల్పపీడనం వేగంగా బలపడుతోంది. ఇది రాబోయే కొద్ది గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారి, అండమాన్-నికోబార్ దీవుల చుట్టూ కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ, అక్టోబర్ 30వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో వాయుగుండంగా మారనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం తీవ్ర కలకలం సృష్టించిన ‘అర్నబ్’ తుఫాను ఏ మార్గంలో అయితే ప్రయాణించి తీరాన్ని దాటిందో, సరిగ్గా అదే బాటలో ఈ కొత్త వాయుగుండం కూడా ప్రయాణించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఒకవేళ ఇదే నిజమైతే, ఇప్పటికే వరదలు, ఈదురుగాలుల దెబ్బకు కోలుకోలేని స్థితిలో ఉన్న గోదావరి జిల్లాలకు, ముఖ్యంగా తీరప్రాంతమైన కోనసీమకు భారీ స్థాయిలో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
Also Read
- Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి షాపుల్లో అవి కూడా..
- Ind Vs Nepal: నేపాల్‌పై భారత్-ఏ భారీ విజయం.. 306 పరుగుల తేడాతో వరల్డ్ రికార్డు బద్దలు..
- OTR: రాజమహేంద్రవరం వైసీపీలో వెన్నుపోట్ల కలకలం
ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో కోనసీమ వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉండటంతో పాటు పంట చేతికొచ్చే సమయంలో వరి, కొబ్బరి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని అధికార యంత్రాంగం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తీరప్రాంత ప్రజలు, రైతులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, తుఫాను సహాయక బృందాల హెచ్చరికలను పాటించాలని విపత్తు నిర్వహణ శాఖ కోరింది.
తాజావార్తలు
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్‌కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్‌లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!