Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rice Flour Poori Recipe: పండగలు, ప్రత్యేక రోజుల్లో ఇంట్లో పూరీలు, కూర, పాయసం లాంటి విందు భోజనం చేయడం కామన్. కానీ.. నార్మల్ గోధుమ పిండి పూరీలకు బదులుగా ఏదైనా కొత్తగా, ట్రెడిషనల్‌గా ట్రై చేయాలనిపిస్తుంది కదా! ఈ ఫెస్టివల్ సీజన్లో రోజూ తినే అవే పాత పూరీలు కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయండి. ఈసారి లంచ్‌లో బియ్యప్పిండితో ఎంతో రుచికరమైన, సాఫ్ట్‌గా వచ్చే పూరీలు చేసి పెట్టండి. చాలా మందికి బియ్యప్పిండి పూరీలు చేసేటప్పుడు పిండి సరిగ్గా రాకపోవడం, ఒత్తేటప్పుడు విరిగి పోవడం లేదా గట్టిగా అయిపోవడం లాంటి సమస్యలు వస్తుంటాయి. కానీ, ఇక్కడ చెప్పే చిన్న ట్రిక్ ఫాలో అయితే మీ పూరీలు కూడా చక్కగా పొంగుతూ, లోపల చాలా సాఫ్ట్‌గా వస్తాయి. వీటిని తయారు చేసే విధానం, సీక్రెట్ ట్రిక్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
బియ్యప్పిండి: 2 కప్పులు
ఉడికించిన బంగాళాదుంప: 1 మీడియం సైజ్
జీలకర్ర లేదా వాము: 1 చిన్న స్పూన్
తెల్ల నువ్వులు: 1 చిన్న స్పూన్
సన్నగా తరిగిన కొత్తిమీర: 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి: 1 లేదా 2 (సన్నగా తరిగినవి)
నెయ్యి లేదా నూనె: 1 టేబుల్ స్పూన్ (పిండి కలపడానికి)
వేడి నీళ్లు: పిండి తలపడానికి (సుమారు 1 నుంచి 1.5 కప్పులు)
ఉప్పు: తగినంత
నూనె: పూరీలు వేయించడానికి సరిపడా
Also Read
- Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
- Potato Samosa: కరకరలాడే రుచికరమైన బేకరీ స్టైల్ 'ఆలూ సమోసా'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
- Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ "దద్దోజనం" కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
- How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
తయారీ విధానం:
బియ్యప్పిండిలో గ్లూటెన్ ఉండదు కాబట్టి, దీన్ని సాధారణ నీటితో తడిపితే పూరీలు విడిపోతుంటాయి. అందుకే ముందుగా ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి, అందులో జీలకర్ర, వాము, ఉప్పు, ఒక స్పూన్ నెయ్యి వేసి నీటిని బాగా మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, అందులో కొద్దికొద్దిగా బియ్యప్పిండి వేస్తూ ఉండలు కట్టకుండా గరిటెతో బాగా కలపాలి. ఆ తర్వాత దాన్ని మూతపెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. దీనివల్ల పిండి ఆవిరిలో చక్కగా నాని సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమం గోరువెచ్చగా అయిన తర్వాత, అందులో ముందుగా తురిమి పెట్టుకున్న ఉడికించిన బంగాళాదుంప, సన్నగా తరిగిన కొత్తిమీర, పచ్చిమిర్చి వేయాలి. చేతులకు కొద్దిగా నూనె రాసుకుంటూ పిండిని చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి.
ఇలా సిద్ధం చేసుకున్న పిండితో చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. పీటపై కొద్దిగా పొడి బియ్యప్పిండి లేదా నూనె రాసుకొని, పూరీలను మరీ పల్చగా కాకుండా మోస్తరుగా ఒత్తుకోవాలి. అంచులు ఏమైనా పగులుతుంటే చిన్న గిన్నె లేదా డబ్బ మూత పెట్టి గుండ్రంగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాణలిలో నూనె పోసి బాగా వేడెక్కనివ్వాలి. మరుగుతున్న నూనెలో ఒత్తుకున్న పూరీ వేసి గరిటెతో పైపై తేలికగా అతుముతుంటే, పూరీ చక్కగా గులాబీలా పొంగుతుంది. ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి బయటకు తీయాలి. అంతే, వేడివేడిగా, ఎంతో సాఫ్ట్‌గా ఉండే బియ్యప్పిండి పూరీలు సిద్ధం! వీటిని మీకిష్టమైన బంగాళాదుంప కూర, సబ్జీతో కలిపి తింటే రుచి అదిరిపోతుంది.
తాజావార్తలు
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Jamia Students Protest: “2006 నుంచి ఎన్నికలు లేవు”.. తీవ్రరూపం దాల్చిన జామియా యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమం..
-
AP Local Elections 2026: రెబల్స్ పోటీలో ఉంటే సస్పెండే.. సీఎం చంద్రబాబు హెచ్చరిక!
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Honor X8e 4G: హానర్ X8e 4G లాంచ్.. 108MP కెమెరా, 7,700mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్!
ట్రెండింగ్
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!