Perni Nani: తొడలు కొట్టే రాజకీయం పవన్ కళ్యాణ్ దే.. అర్థరాత్రి మద్దెల దరువు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేనాని పవన్ కల్యాన్ మచిలీపట్నం సభపై మాజీ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో స్పందించారు. తొడలు కొట్టే రాజకీయం పవన్ కళ్యాణ్ దే అంటూ వ్యాఖ్యానించారు. తొడలుకొట్టాల్సిన అవసరం తమకేం లేదన్నారు. దుర్యోధనుడు, ధృతరాష్ట్రుళ్లు పవన్ పక్కనే ఉన్నారన్నారు. ఓ నాయకుడు పార్టీ పెట్టి మూసేశాడంటూ సొంత అన్ననే పవన్ హేళన చేశాడని విమర్శించారు. రాజకీయాల్లో వచ్చి పదేళ్ళు అవుతుందని అంటున్నారు. 2009లో యువరాజ్యం అధ్యక్షుడు కాదా? అది రాజకీయం కాదా? అని పేర్ని నాని ప్రశ్నించారు. ప్రజారాజ్యం పెట్టిన తన అన్న చిరంజీవినీ పరోక్షంగా ఎత్తిపొడుస్తున్నాడని మండిపడ్డారు. డబ్బులు లేవు అంటూనే రోజుకు రెండు కోట్లు నా సంపాదన అని తనే అన్నారని ఎద్దేవా చేశారు. జనసేన స్థాపించిన సమయంలో చిరంజీవి ఏ హోదాలో ఉన్నారని పేర్ని నాని ప్రశ్నించారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే జనసేన ఆవిర్భావ వేడుక జరిపారని గుర్తుచేశారు. కేంద్ర మంత్రి పదవి రాజకీయం కాదా? అని నిలదీశారు.
బందర్ లో బీసీ డిక్లరేషన్ అని బీసీలకు మాటిచ్చాడు 48 గంటలు కూడా అవ్వక ముందే బీసీ డిక్లరేషన్ మాట మర్చిపోయాడని సెటైర్లు వేశారు. నోరు తెరుస్తే కులం పేరుతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కు సంకల్పం, చిత్తశుద్ధి, నాయకత్వం ఉంటే తన లాంటి వాళ్లు ఆయన వెనుకే ఉండేవారమని, జగన్ వెంట ఎందుకు వెళ్తామంటూ ప్రశ్నించారు. జగన్ తాను నమ్మిన సిద్ధాంతం కోసం, ఇచ్చిన మాట కోసం ఎంత త్యాగం చేయటానికి అయినా సిద్ధం పడతారని పేర్ని నాని చెప్పారు. జగన్ నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వ పడుతున్నామన్నారు. 2014 నుంచి పవన్ పచ్చిగా కాపు కులస్తులను పోగేసి కమ్మాయనికి ఊడిగం చేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాడని, అందుకే పవన్ తో కులాల గురించి మాట్లాడిస్తున్నారని చెప్పారు. 2019లో ఇదో దొంగ ప్రభుత్వం అని టీడీపీని విమర్శించారని గుర్తుచేశారు. పవన్ కళ్యాణ్ సభ అర్థరాత్రి మద్దెల దరువు అంటూ వ్యాఖ్యానించారు. పవన్ దుర్మార్గమైన రాజకీయ క్రీడ ఆపాలన్నారు. ముసుగులు వేసుకుని కాకుండా చెట్టాపట్టాలేసుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి రండి అంటూ సవాల్ చేవారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో, బంద్ లో ప్రభుత్వమే పాల్గొంటే మీకు కనిపించటం లేదా అంటూ పవన్ పై పేర్ని నాని నిప్పులు చెరిగారు. కులరహిత రాజకీయాలంటూనే మళ్లీ కాపుల కోసం పనిచేస్తున్నానని మహానుభావుడు అంటున్నారని పేర్ని నాని విమర్శించారు. కాపులకు ఎవరేం చేశారనేది అందరికీ తెలుసని చెప్పారు. కాపులందరమూ కలిసి చంద్రబాబును ఆశ్రయిద్దామని అంటున్నారని.. కాపులు మాత్రం జగన్ వెంటే ఉన్నారని నాని అన్నారు. కాపుల్లో 60 శాతం మంది జగన్ వెంటే ఉన్నారని, ఉంటారని, ఇకపైనా ఉండబోతున్నారని స్పష్టం చేశారు.
Also Read
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
కాగా, మచిలీపట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ వైసీపీ సర్కార్ పై తీవ్ర విమర్శులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పేర్ని నాని జనసేనానికి కౌంటర్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!