Gudivada Amarnath: కేంద్రంతో కాకపోతే పుతిన్‌తో చెప్పుకో.. పవన్‌కి మంత్రి అమర్నాథ్ సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath Sensational Comments On Pawan Kalyan: జనసేనాధిపతి పవన్ కళ్యాణ్‌పై మంత్రి అమర్నాథ్ మరోసారి ధ్వజమెత్తారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పవన్ వారాహి యాత్రలో ముఖ్యమంత్రిపై విషం, విద్వేషం కనిపిస్తోందన్నారు. ప్రజలను తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రుషికొండ వరకు వెళ్లిన పవన్‌కు పక్కనే గీతం సంస్థ చేసిన అక్రమాలు కనిపించలేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం, ప్రభుత్వ భూమినే కబ్జా చేయడం అనే విమర్శ అవగహన రాహిత్యానికి నిదర్శనమ్నారు. యజమాని కోసం పవన్ కోతిలా గంతులు వేస్తున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Anand Mahindra: రోబోలా మారిన కారు…చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
పవన్ కళ్యాణ్, చంద్రబాబు, వాళ్లకు సహకరిస్తున్న మీడియా.. అందరూ స్టువర్ట్‌పురం దొంగలని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. అటువంటి వాళ్ళు వాలెంటీర్లను దండు పాళ్యమని అవమానించడానికి నోరెలా వస్తోందని మండిపడ్డారు. పూర్తి అనుమతులతో రుషికొండ అభివృద్ధి జరుగుతుంటే.. వచ్చిన నష్టం, అభ్యంతరం ఎందుకో పవన్ కళ్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలనే ఆలోచన తప్ప పవన్ కళ్యాణ్‌కు ఒక విధానం లేదని దుయ్యబట్టారు. చిరంజీవి జూబ్లీహిల్స్‌లో కట్టిన ఇల్లు కొండ మీద కాదా? ఇందుకు పవన్ సమాధానం చెప్పాలన్నారు. భూమి లభ్యత తక్కువగా ఉన్న చోట కొండల మీద కాకపోతే నిర్మాణాలు ఎక్కడ చేయాలి? అని నిలదీశఆరు. కట్టుకథలు అల్లి ప్రజలను తప్పుదారి పట్టించడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు.
Yashasvi Jaiswal Fifty: అరుదైన రికార్డు నెలకొల్పిన యశస్వి జైస్వాల్.. శుభ్‌మన్ గిల్‌తో మరో రికార్డు!
గట్టిగా ప్రశ్నిస్తే కేంద్రంతో చెప్పి ఆటాడిస్తానని పవన్ బెదిరిస్తున్నాడని.. కేంద్రంతో కాకపోతే పుతిన్‌తో చెప్పుకో అని మంత్రి అమర్నాథ్ సవాల్ విసిరారు. డాడీ, దత్తపుత్రుడు విడతల వారీగా విశాఖకు వచ్చి అసత్యాలు ప్రచారం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 15కు పవన్ మంగళగిరి వెళితే.. చంద్రబాబు విశాఖ వస్తున్నారన్నారు. ఇద్దరు వేర్వేరుగా తిరగడం ఎందుకు.. కలిసి మెలిసి పర్యటించడం మంచిదని హితవు పలికారు. మోడీ అంటే భయం ఉండొచ్చు కానీ, డాడీని చూసి ఎందుకు భయపడుతున్నారో పవన్ చెప్పాలన్నారు. బానిసత్వంలో బ్రతుకుతూ.. వాలేంటీర్లు వ్యవస్థపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!