Anand Mahindra: రోబోలా మారిన కారు…చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన మనసుకు నచ్చిన విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు ప్రముఖ వ్యాపారవేత్త ‘ఆనంద్ మహీంద్రా’. ఎన్నో ఆసక్తికరమైన వీడియోలను ట్విటర్ ద్వారా షేర్ చేస్తుంటారు. అలాంటి వీడియోనే ఒకటి తాజాగా ఆయన షేర్ చేయగా చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలో అంతగా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏముందా అని అనుకుంటున్నారా? అయితే వీడియో గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. మనం కొన్ని హలీవుడ్ సినిమాల్లో చూసినట్లయితే ఒక కారు రోడ్డు మీద రయ్యిమంటూ వెళ్తూ సడెన్ గా రోబోలా మారిపోతూ ఉంటుంది. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో కూడా ఏకంగా ఒక బీఎమ్ డబ్య్లూ కారు ఇలానే రోబోలా మారిపోయింది.
Also Read: MS Dhoni: ఆ విషయంలో ఇబ్బంది పడిన ధోనీ, సాయం చేసిన అభిమాని… వీడియో వైరల్
Also Read
ఈ ప్రయోగాన్ని 2016 లో టర్కీ దేశానికి చెందిన ఓ కార్ల కంపెనీ చేసినట్లుగా తెలుస్తోంది. దీనిని చూడగానే అక్కడ ఉన్నవారందరూ తమ ఫోన్లలో వీడియోను తీసుకున్నారు. పిల్లలు, పెద్దవారు కూడా ఆశ్చర్యంతో చప్పట్లు కొట్టారు. ఇక ఈ వీడియో ఆనంద్ మహీంద్రాను కూడా ఫిదా చేయడంతో దానిని షేర్ చేస్తూ టర్కిష్ ఆర్ అండ్ డీ కంపెనీ రూపొందించి, ప్రదర్శించిన ట్రాన్స్ ఫార్మర్, మన ఆర్ అండ్ డీలో కూడా ఇలాంటి ఫన్ ఉండాలంటూ మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ టెక్నాలజీ ప్రెసిడెంట్ ‘వేలు మహీంద్రా’ను ఆనంద్ మహీంద్రా ట్యాగ్ చేశారు.
ఈ వీడియోను ఇప్పటికి వరకు లక్షల మంది చూశారు. చూసిన వారిలో చాలా మంది తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఆవిష్కరణలు మన ఇండియన్ కంపెనీలు కూడా చేయాలని కొంతమంది నెటిజన్లు ఆనంద్ మహీంద్రాతో ఏకీభవిస్తూ కామెంట్ చేస్తున్నారు.
A real-life ‘transformer’ developed & showcased by a Turkish R&D company. We should be having such fun at our R&D too! @Velu_Mahindra ? https://t.co/Ru1uK01RaA
— anand mahindra (@anandmahindra) August 7, 2023
తాజావార్తలు
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
-
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
-
EPFO నిబంధనల్లో కీలక మార్పు.. ఏం మారుతుందో తెలుసుకోండి..!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!