Wine Shop Tenders: వైన్ షాపు టెండర్లకు అనూహ్య స్పందన లభిస్తోంది. వ్యాన్స్ లైసెన్సుల అనుమతులను పొందడానికి ఆశావాదులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 6913 దరఖాస్తులు వచ్చాయని సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు.
ఏపీలో ప్రభుత్వ వైన్ షాపుల్లో చేపట్టిన తనిఖీలు ముగిసాయి. జిల్లా వ్యాప్తంగా 266 మద్యం దుకాణాల్లో లెక్కలు బయటకు తీశాయి ప్రత్యేక బృందాలు. సర్కిల్-4 పరిధిలోని వైన్ షాపుల్లో గోల్ మాల్ వెలుగు చుసిన విషయం తెలిసిందే. 35 లక్షల ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించారు సిబ్బంది. సిఐ నాగశ్రీనివాస్ ప్రమేయం నిర్ధారణ కావడంతో అతని పై వేటు పడింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్.ఐ.విమలాదేవి, ముగ్గురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే ఆ నాలుగు షాపుల్లో…
విశాఖ ఎక్సయిజ్ స్కామ్ లో తీగలాగితే డొంక కదులుతుంది. ప్రభుత్వ వైన్ షాపుల్లో భారీగా నిధులు గోల్ మాల్ చేసినట్లు తెలుస్తుంది. విశాఖ పరిధిలోని 14షాపుల్లో నగదు తేడాలు గుర్తించారు. లక్షల రూపాయలు పక్కదారి పట్టించారు సిబ్బంది. వ్యవహారం వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన అక్రమార్కులు నొక్కేసిన నగదు చెల్లించేందుకు అంగీకరించినట్టు సమాచారం. సర్కిల్-4లో వెలుగు చూసిన సిబ్బంది చేతివాటంతో విచారణ మొదలయింది. ఫేక్ చలాన్ల తో బ్యాంకు, ప్రభుత్వాన్ని మోసం చేసి లక్షల రూపాయలు మాయం చేసారు.…