హమాస్ అంతమే లక్ష్యంగా ఇప్పటికే ముఖ్య నాయకులకు ఇజ్రాయెల్ దళాలు అంతమొందించాయి. గాజాను పూర్తిగా ధ్వంసం చేసింది. అయితే తాజాగా అక్టోబర్ 17న హమాస్ అధినేత యాహ్యా సిన్హార్‌ను కూడా మట్టుబెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
నల్గొండ జిల్లా మిర్యాల గూడలో భారీగా బంగారం పట్టుబడింది. సోమవారం లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో.. ఈదులగూడ చౌరస్తా వద్ద తనిఖీలు చేస్తుండగా.. మిర్యాలగూడ టౌన్ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో రూ.5.73 కోట్లు విలువ చేసే 13 కిలోల బంగారం పట్టుకున్నారు. బంగారం, వాహనాన్ని స్వాధీనం చేసుకుని.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.. కాగా.. బంగారం, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.…
ఛలో విధ్యుత్ సౌద మరియు మహాధర్నా సందర్భంగా విజయవాడలోని హోటల్స్, లాడ్జ్ లను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈనెల 8న చలో విద్యుత్ సౌధ పిలుపు నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
ఏపీలో ప్రభుత్వ వైన్ షాపుల్లో చేపట్టిన తనిఖీలు ముగిసాయి. జిల్లా వ్యాప్తంగా 266 మద్యం దుకాణాల్లో లెక్కలు బయటకు తీశాయి ప్రత్యేక బృందాలు. సర్కిల్-4 పరిధిలోని వైన్ షాపుల్లో గోల్ మాల్ వెలుగు చుసిన విషయం తెలిసిందే. 35 లక్షల ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించారు సిబ్బంది. సిఐ నాగశ్రీనివాస్ ప్రమేయం నిర్ధారణ కావడంతో అతని పై వేటు పడింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్.ఐ.విమలాదేవి, ముగ్గురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే ఆ నాలుగు షాపుల్లో…