కరోనా సమయంలో వైద్యులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచాలని నిర్ణయం తీసుకుంది.. మీడియాతో మాట్లాడిన ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్.. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచాలని నిర్ణయం తీసుకున్నాం.. రూ. 45 వేల నుంచి రూ. 70 వేలకు పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు.. ఇక, జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వం పరిశీలిస్తోందని, చర్చిస్తోందన్నారు.. ప్రస్తుతం సుమారు 350 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు…
కరోనా కష్టకాలం కనీసం మానవత్వాన్ని చూపకుండా.. అందినకాడికి దండుకునే దందా కొనసాగిస్తున్నాయి ప్రైవేట్ ఆస్పత్రులు.. అయితే, ప్రైవేట్ ఆస్పత్రుల కోవిడ్ దందాపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. తప్పిదాలకు పాల్పడిన ప్రైవేట్ ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్ధమవుతోంది.. ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్.. ఇప్పటికే నిబంధనలు పాటించని చాలా ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నాం.. ఫైన్లు కూడా వేశామన్నారు.. కోవిడ్ పేషంట్ల నుంచి ఎక్కువ డబ్బులు…
ఇప్పుడు చర్చ మొత్తం కృష్ణపట్నంలో ఆనందయ్య అందిస్తున్న కరోనా ఆయుర్వేద మందుపైనే.. కరోనా రోగుల నమ్మకం, విశ్వాసం ఎలా ఉన్నా ఇప్పుడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దీనిపై ఫోకస్ పెట్టాయి.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలుచేశారు ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆనందయ్య ఆయుర్వేద చికిత్సపై అధ్యయనం జరుగుతోందన్నారు.. కేంద్ర ఆయుష్ శాఖ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపామన్న ఆయన.. ఆయుష్ విభాగం అధ్యయనం చేయనుంది.. సోమవారం…
రాష్ట్రంలో ఆక్సిజన్ బెడ్స్ అవైలబిలిటీ కొంచం తగ్గింది అని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. ప్రస్తుతం 113 కోవిడ్ కేర్ సెంటర్స్ లో 17 వేల మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ప్రతి జిల్లాలో టాస్క్ ఫోర్స్, ఫ్లైయింగ్ స్క్వాడ్ లు కొన్ని ఆసుపత్రుల్లో తనిఖీ చేశారు. మూడు ప్రాంతాల నుండి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ నుండి మనకు ఆక్సిజన్ అందింది. మరింత ఆక్సిజన్ అవసరం అని కేంద్రాన్ని కోరాం. కేంద్రం…
మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడినవారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది.. అయితే, చాలా రాష్ట్రాలను వ్యాక్సిన్ కొరత వేధిస్తుండడంతో.. ఇప్పుడే మా వళ్ల కాదంటూ చాలా రాష్ట్రాలు చేతులెత్తేశాయి.. ఇప్పటికే వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభం కాగా, పెద్ద సంఖ్యలో యూత్ రిజిస్ట్రేషన్ చేసుకునే పనిలో పడిపోయారు.. వారి తాకిడికి సర్వర్లే మోరాయించాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక, ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఇప్పట్లో సాధ్యం…
ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ… ఇప్పటివరకు 437 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేశాం. ఆక్సిజన్ సరఫరాను మరింత పెంచాలని కేంద్రాన్ని కోరాం. ఏపీకి రెండు ట్యాంకర్లు అందుబాటులోకి రానున్నాయి. క్రయోజనిక్ ట్యాంకర్లు అందుబాటులో ఉంటే కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నాము. శ్రీ సిటీలో క్రయోజనిక్ ట్యాంకర్లు అందుబాటులో ఉన్నట్టు సమాచారం ఉంది. 30,559 రెమిడెసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. కోవిడ్ కేర్ సెంటర్లు కొత్తవి ప్రారంభిస్తున్నాం అని అన్నారు. 7,749…