YS Sharmila: APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడలో ఏపీలో అమలవుతున్న సూపర్ సిక్స్ పథకాలపై కూటమి ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ అని పేర్కొనడం సిగ్గుచేటుతో కూడినదని, ప్రజలకు ఇవ్వాల్సిన వాగ్దానాలు పూర్తిగా అమలులోకి వచ్చాయని చెప్పడం హాస్యాస్పదమని ఆమె పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీలలో ఒక్కటైనా పూర్తిగా అమలు అయ్యిందా? రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగులలో ఒక్కరికి కూడా 3,000 రూపాయల భృతి అందించిందా? కూటమి…
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పునర్వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటించబోతున్నారు.
2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొత్త మ్యానిఫెస్టోతో రాబోతుంది అని ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు తెలిపారు. బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం 2024 ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధమైంది.. గుంటూరులో రేపు జరిగే ఓబీసీ సంఘాల సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
Congress Party: రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. గత 9 ఏళ్లుగా ఆ పార్టీ తరఫున అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. దాదాపుగా సీనియర్ నేతలందరూ ఇతర పార్టీలకు వలస వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఏపీసీసీకి కొత్త చీఫ్‌ను అధిష్టానం నియమించింది. తాజాగా ఏపీసీసీ నూతన అధ్యక్షుడిగా శైలజానాథ్ నుంచి గిడుగు రుద్రరాజు శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రుద్రరాజును కలిసి అమరావతి రైతులు అభినందనలు తెలిపారు.…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఏపీలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ఆయన్ను కోరింది. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించింది. ప్రస్తుతం ఏపీసీసీ చీఫ్‌గా పనిచేస్తున్న శైలజానాథ్ అంత యాక్టివ్‌గా లేకపోవడం, గతంలో ఏపీసీసీ చీఫ్‌గా పనిచేసిన రఘువీరారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉండటంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. Adimulapu Suresh: ఏపీలో ఆగస్టు…