Former Minister Vellampalli Srinivas fired on MP Raghu Ramakrishna Raju.
పోలవరం నుంచి ఈ మూడేళ్లలో ఏం చేశాం అనే అంశాల ప్రదర్శన ఉంటుందని ఎన్టీవీతో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్టీవీతో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు చెప్పాలని ప్రజలు ప్లీనరీకి రానున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలందరు 8, 9 తేదీలు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యతో ఉంటే తప్పేంటి..? అని ఆయన ప్రశ్నించచారు. అప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుందని, పనికి మాలిన ఎంపీ మాటలను, పకోడి రామకృష్ణ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
Krishna River : ఈ ఏడాది కృష్ణమ్మ పరవళ్లేవి..?
ఎన్నికల సమయంలోనే జగన్ రాజకీయాలు చేస్తారని, మిగిలిన సమయంలో ప్రజల, రాష్ట్ర అభివృద్ధి పైనే దృష్టి పెడతారని ఆయన స్పష్టం చేశారు. మూడేళ్ళు కుంభకర్ణుడుగా పవన్ కళ్యాణ్ నిద్రపోయాడా అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ కు జనవాణి తెలియదు.. ధన వాణి మాత్రమే తెలుసు అంటూ సెటైర్లు వేశారు. డబ్బులు తీసుకుని చంద్రబాబు, బీజేపీ, కమ్యూనిస్టులు, ఇతర రాష్ట్రాల పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్రస్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, ఒక్క పది రోజుల ఏపీలో నిద్ర తీసి ఆ తర్వాత రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడాలన్నారు వెల్లంపల్లి.