Honor Killing: ఏపీలో పరువుహత్య.. కూతుర్ని దారుణంగా చంపిన తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Father Killed His Daughter In Nandyal District Because Of Extramarital Affair: ఏపీలోని నంద్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన కన్న కూతురినే ఓ తండ్రి అత్యంత కిరాతకంగా చంపేశాడు. వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతోనే ఆ తండ్రి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. పాణ్యం మండలం ఆలమూరుకు చెందిన దేవేందర్ రెడ్డికి ప్రసన్న అనే కుమార్తె ఉంది. ఈమెకు 18 నెలల క్రితం గోస్పాడు మండలం జిల్లెల్లకు చెందిన ఓ యువకుడితో వివాహం జరిగింది. తన భర్తతో కలిసి హైదరాబాద్‌కి వచ్చిన ప్రసన్న.. నగరంలో కాపురం పెట్టింది. అయితే.. భర్తతో మనస్పర్థలు ఏర్పడటంతో ప్రసన్న పుట్టింటికి తిరిగొచ్చింది.
China Bumper Offer: కొత్త జంటలకు చైనా బంపరాఫర్.. నెల రోజులు ఫ్రీ
Also Read
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్‌కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
- Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
- Gadikota Srikanth Reddy: 'ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు'.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
రోజులు గడుస్తున్నా ప్రసన్న తిరిగి భర్త వద్దకు వెళ్లకపోవడంతో.. కాపురానికి వెళ్లాల్సిందిగా దేవేందర్ రెడ్డి చాలాసార్లు నచ్చజెప్పాడు. ఎన్ని గొడవలు జరిగినా, సర్దుబాటు చేసుకోవాలని చెప్పేందుకు ప్రయత్నించాడు. అయినా పట్టించుకోకుండా ప్రసన్న పుట్టింట్లోనే ఉండిపోయింది. దీంతో తండ్రికి అనుమానం వచ్చింది. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందేమోనని, అందుకే భర్త వద్దకు వెళ్లకుండా పుట్టింట్లోనే ఉందని అనుమానం కలిగింది. దీంతో.. కూతురిని చంపేయాలని దేవేందర్ రెడ్డి నిర్ణయించుకున్నాడు. ఈ నెల 10వ తేదీన రాత్రి అందరూ నిద్రపోయినప్పుడు.. ప్రసన్న గొంతు నులిమి చంపేశాడు. కొందరి సహాయంతో ప్రసన్న మృతదేహాన్ని నంద్యాల-గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్డులోని పచ్చర్ల ప్రాంతానికి తీసుకెళ్లాడు. మృతదేహాన్ని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు.. తల, మొండెను వేరు చేశాడు. వాటిని వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశాడు.
Bandi Sanjay: బీఆర్ఎస్ను తరిమికొడదాం.. రామరాజ్యం స్థాపించుకుందాం
ఈ ఘటనపై స్థానికులు సమాచారం అందించడంతో.. పాణ్యం పోలీసులు రంగంలోకి దిగారు. కుళ్లి కంపు కొడుతున్న మృతదేహం, శిథిలాలను సేకరించి.. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి దేవేందర్ రెడ్డినే కూతుర్ని హత్య చేశాడని దర్యాప్తులో తేలింది. దీంతో.. దేవేందర్‌తో పాటు అతనికి సహకరించిన మరికొందరిపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. మరొకరితో తన కూతురు వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతోనే తాను చంపేశానని విచారణలో దేవేందర్ ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్‌కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Yuvraj Singh: 2027 వరల్డ్‌కప్‌కు యువరాజ్ జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు!
-
Numerology: ఈ తేదీల్లో పుట్టినవారికి ఏకాంతమే ఇష్టం! సంఖ్యాశాస్త్రం ఏమి చెబుతోందంటే ?
ట్రెండింగ్
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!