Yuvraj Singh: 2027 వరల్డ్‌కప్‌కు యువరాజ్ జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 2027 వన్డే వరల్డ్‌కప్ కోసం తన డ్రీమ్ భారత జట్టును ప్రకటించాడు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లతో పాటు సీనియర్ ఆటగాళ్లతో యువరాజ్ తన జట్టును ఎంచుకున్నాడు. యువీ తన జట్టులో సీనియర్ స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలకు చోటు ఇవ్వలేదు. ప్రస్తుతం యువరాజ్ జట్టుపై క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది.
యువరాజ్ సింగ్ తన జట్టుకు శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్‌కు అవకాశం ఇచ్చాడు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీకి చోటు కల్పించిన యువరాజ్.. నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్, ఐదో స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేశాడు. మిడిల్ ఆర్డర్లో నిలకడ ఉండేలా ఈ కాంబినేషన్‌ను ఎంచుకున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లకు అవకాశం ఇచ్చాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ మ్యాచ్‌ను మలుపుతిప్పే సామర్థ్యం వీరికి ఉందని యువీ అభిప్రాయపడ్డాడు.
Also Read
- Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్‌కు చోటు కల్పించగా.. పేస్ దళంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలను యువరాజ్ సింగ్ ఎంపిక చేశాడు. వికెట్‌కీపర్‌గా రిషభ్ పంత్‌కు అవకాశం ఇచ్చిన యువీ.. అతడిని జట్టులో కీలక సభ్యుడిగా పరిగణించాడు. అయితే ఈ జట్టులో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి సీనియర్ ఆటగాళ్లకు చోటు లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. 2027 ప్రపంచకప్ సమయానికి యువ జట్టును నిర్మించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
యువరాజ్ సింగ్ ఎంపిక చేసిన భారత జట్టు ఇదే:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్)
యశస్వి జైస్వాల్
విరాట్ కోహ్లీ
కేఎల్ రాహుల్
శ్రేయస్ అయ్యర్
రిషభ్ పంత్
హార్దిక్ పాండ్యా
అక్షర్ పటేల్
వాషింగ్టన్ సుందర్
జస్ప్రీత్ బుమ్రా
మహ్మద్ సిరాజ్
అర్ష్‌దీప్ సింగ్
కుల్దీప్ యాదవ్
హర్షిత్ రాణా
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!