తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన నుంచి సీఎం చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఇక్కడ చంద్రబాబు, ఎస్పీ, టీటీడీ పాలకమండలిలోని అందరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా.. అంతేకాదు.. దేశంలో ఉన్న కోర్టులు సుమోటోగా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.. ఆరు మంది భక్తులు చనిపోయారు, 60 మంది గాయపడ్డారు. అసలైన నిందితులపై కేసులు ఎందుకు పెట్టలేదు? అని నిలదీశారు.. మూడు రోజులు అయ్యింది, ఎందుకు…
ఏపీ పాలిటిక్స్‌లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న లీడర్ ఆర్కే రోజా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ రేంజ్‌లో హవా నడిపిన మాజీ మంత్రి... ఓటమి తర్వాత చాలా రోజులు పొలిటికల్ అజ్ఞాతంలో గడిపారు. అప్పట్లో అందరికంటే ఎక్కువగా పవర్‌ని, పదవిని ఎంజాయ్ చేశారన్న పేరు వచ్చింది ఆమెకు. అలాగే నాటి ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలు ఆమె స్థాయిని దిగజార్చాయన్న అభిప్రాయం ఉంది.
ఆర్కే రోజా... ఏపీ పాలిటిక్స్‌లో ఫైర్ బ్రాండ్. ఎనీ సబ్జెక్ట్, ఎనీ సెంటర్... తెలిసినా, తెలియకున్నా సరే.. వాగ్ధాటితో అవతలోళ్ళ నోరు మూయించడంలో దిట్ట. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి...మంత్రిగా పనిచేసిన రోజా.... గత ఎన్నికలలో దారుణమైన ఓటమి తర్వాత దాదాపుగా పొలిటికల్ అజ్ఞాతంలో ఉన్నారు. పాలిటిక్స్‌లో నోరే నా ఆయుధం అనుకున్న మాజీ మంత్రికి గత ఎన్నికల్లో అదే రివర్స్ అయిందన్న అభిప్రాయం ఉంది.
మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్కే రోజా.. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు.. ఎన్నికల హామీలను చంద్రబాబు మర్చిపోయారని దుయ్యబట్టారు.. ఇక, విద్యుత్ ఛార్జీలపై పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ ఏమైంది? అని అంటూ నిలదీశారు.. అసలు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచుతూ పోతుంటూ.. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ అసలు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని నిలదీశారు.. ఏదేమైనా పెంచిన ఛార్జీలు తగ్గించేవరకు పోరాటం ఆగదని…
మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఆర్కే రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఓవైపు తప్పులు చేసి మనం ఓడిపోలేదు అని పార్టీ శ్రేణులకు ధైర్యం చెబుతూనే.. మరోవైపు కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు రోజా.. జైల్లో పెడతావా..? పెట్టుకో.. కేసులు పెడతావా? పెట్టుకో.. ఉద్యోగాలు తీసేస్తావా తీసేసెయ్..! మళ్లీ మా ప్రభుత్వం వస్తుంది.. వడ్డీతో సహా తిరిగి ఇస్తామని హెచ్చరించారు.. ఇక, కూటమి ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడ్డ కార్యకర్తల పేర్లను గుడ్…
ఓవైపు కేసుల భయం, మరోవైపు ఏం మాట్లాడినా ఇరుక్కుంటామన్న ఆందోళనతో ఇప్పుడు రోజా డైవర్షన్ కోసం చూస్తున్నట్టు సమాచారం. ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రాజకీయ సెగ నుంచి తప్పించుకోవడానికి... తిరిగి టాలీవుడ్, కోలీవుడ్ వైపు చూస్తున్నారట రోజా. క్యారెక్టర్ రోల్స్ చేయడానికి నేను రెడీ... అంటూ తన టీమ్ ద్వారా తెలుగు, తమిళంలోని పలువురు దర్శకులకు, నిర్మాతలకు సంకేతాలు పంపినట్టు సమాచారం.
విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా.. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నారు.. వారి కష్టాలు వర్ణనాతీతం.. వారి మాటలు విటుంటే నాలుగురోజుల నుండి వాళ్లు ఎంత నరకం అనుభవించారో అర్థమవుతుంది.. కనీసం పసిబిడ్డలకు పాలు కూడా అందలేదు.. రోజుల తరబడి మంచి నీళ్లు కూడా అందలేదు అన్నారు..