Partition 1947: ‘పార్టిషన్ 1947’ ప్రమోషన్లో కలకలం.. యువకుడికి ప్రమాదం.. యోగిని కలిసిన సన్నీ, ప్రీతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Partition 1947: చాలా ఏళ్ల తర్వాత సన్నీ డియోల్, ప్రీతి జింటా కలిసి వెండితెరపై కనిపించబోతుండటంతో ‘పార్టిషన్ 1947’ ను చూసేందుకు అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం కూడా ఈ ఇద్దరూ దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో లక్నోలో నిర్వహించిన ప్రమోషన్ ఈవెంట్లో ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అభిమానుల భారీ రద్దీ మధ్య ఒక యువకుడికి గాయాలు కావడంతో కొద్దిసేపు అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
సన్నీ డియోల్, ప్రీతి జింటా సినిమా ప్రమోషన్ కోసం లక్నోలోని కృష్ణ నగర్ ప్రాంతంలోని ఫీనిక్స్ మాల్‌కు శుక్రవారం వెళ్లారు. తమ అభిమాన నటీనటులను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో ఫొటోలు తీసుకుంటుండగా ఒక వ్యక్తి కాలికి గాయం కావడంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. తొలుత సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ప్రమాద తీవ్రతపై రకరకాల ప్రచారం జరిగింది.
Also Read
- Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
- Peddi - Irumudi: 'పెద్ది' ఓడిపోయింది.. 'ఇరుముడి' గెలవలేకపోయింది!
- Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
- Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
అయితే లక్నో పోలీసులు దీనిపై వెంటనే స్పష్టత ఇచ్చారు. ఫీనిక్స్ మాల్లో ఫొటోలు తీసుకుంటున్న సమయంలో వ్యక్తి కాలికి స్వల్ప గాయం మాత్రమే అయిందని పోలీసులు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. గాయపడిన వ్యక్తికి ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారని, ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నాడని స్పష్టం చేశారు. ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదని పేర్కొన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో శాంతిభద్రతలు పూర్తిగా సాధారణంగా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే లక్నో పర్యటన సందర్భంగా సన్నీ డియోల్, ప్రీతి జింటా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కూడా కలిశారు. నిన్న ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ ప్రత్యేక సమావేశంలో ఇద్దరు నటులతో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. అనంతరం వారికి దేవుళ్లు, దేవతల విగ్రహాలను బహూకరించి ఫొటోలకు పోజులిచ్చారు.
సన్నీ డియోల్, ప్రీతి జింటా కాంబినేషన్‌కు కూడా ‘పార్టిషన్ 1947’ ప్రత్యేకమైనదే. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఇద్దరు నటులు మరోసారి కలిసి తెరపై కనిపించనున్నారు. గతంలో 2018లో విడుదలైన ‘భయ్యాజీ సూపర్‌హిట్’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, సన్నీ, ప్రీతి కెమిస్ట్రీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
ఇప్పుడు ‘పార్టిషన్ 1947’తో ఈ హిట్ జంట మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. హిస్టారికల్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే బజ్ పెరిగింది. ఆగస్టు 14న ‘పార్టిషన్ 1947’ థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్ సమయంలో చోటుచేసుకున్న ఘటనపై పోలీసులు స్పష్టత ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు చాలా కాలం తర్వాత సన్నీ, ప్రీతి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో మూవీని చూసేందుకు ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
- Tags
- cinema
- Partition 1947
తాజావార్తలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!