Fortune Sunflower Oil FSSAI: ఈ వంట నూనె వాడుతున్నారా?.. ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ శాంపిల్ ల్యాబ్ పరీక్షలో విఫలం..!
- ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ శాంపిల్ ల్యాబ్ పరీక్షలో విఫలం
- గోవాలో సేకరించిన ఫార్చ్యూన్ ఆయిల్ నమూనా
- విటమిన్ ఏ, డీ స్థాయిలు తక్కువగా ఉన్నట్లు గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fortune Sunflower Oil FSSAI:ప్రముఖ వంట నూనె బ్రాండ్ ఫార్చ్యూన్ కు చెందిన ఫోర్టిఫైడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ నమూనా ల్యాబొరేటరీ పరీక్షలో నిర్దేశిత ప్రమాణాలను అందుకోలేదని భారత ఆహార భద్రత అండ్ ప్రమాణాల అథారిటీ (FSSAI) వెల్లడించింది. నాసిరకం ఫోర్టిఫైడ్ పొద్దుతిరుగుడు నూనెను తయారు చేసి, విక్రయించినందుకు AWL అగ్రి బిజినెస్ లిమిటెడ్ పై జరిమానా విధించినట్లు తెలిపింది. అయితే జరిమానా మొత్తాన్ని FSSAI వెల్లడించలేదు. అహ్మదాబాద్‌కు చెందిన AWL అగ్రి బిజినెస్ లిమిటెడ్.. ఫార్చ్యూన్ బ్రాండ్ పేరుతో పలు రకాల వంట నూనెలను మార్కెట్లో విక్రయిస్తోంది.
గోవాలో సేకరించిన ఫార్చ్యూన్ ఆయిల్ నమూనా
FSSAI తెలిపిన వివరాల ప్రకారం, గోవాలోని తాజ్ ఫోర్ట్ అగ్వాడ రిసార్ట్ & స్పా నుంచి ‘ఫార్చ్యూన్ ఫ్రయోలా రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ సీడ్ ఆయిల్’కు చెందిన ఒక లీటర్ నమూనాను సేకరించారు. ఈ నమూనాను పరీక్షించగా, ఫోర్టిఫైడ్ వంట నూనెలకు సంబంధించి Food Safety and Standards (Fortification of Foods) Regulations, 2018లో నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేదని ప్రాథమిక ఆహార ప్రయోగశాల నివేదికలో వెల్లడైంది.
Also Read
- Bank Holidays: రాబోయే 2 నెలల్లో 33 రోజులు బ్యాంకులు బంద్! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..
- RBI Data Centre: భువనేశ్వర్‌లో RBI డేటా సెంటర్ ప్రారంభించిన ప్రధాని మోడీ.. సైబర్ సెక్యూరిటీకి కీలక అడుగు
- SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
- Jio IPO Creates 12 Records: జియో ఐపీఓ సరికొత్త రికార్డ్స్.. రూ.7.4 లక్షల కోట్ల బిడ్స్, 1.38 కోట్ల దరఖాస్తులు!
విటమిన్ ఏ, డీ స్థాయిలు తక్కువగా ఉన్నట్లు గుర్తింపు
ఫోర్టిఫైడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్లో ఉండాల్సిన విటమిన్ A, విటమిన్ D స్థాయిలు నిర్దేశించిన పరిమితుల కంటే తక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో సంబంధిత ఉత్పత్తిని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేనిదిగా ప్రకటించారు. కంపెనీ అభ్యర్థన మేరకు మరో అనుబంధ ప్రయోగశాలలో కూడా నమూనాను పరీక్షించారు. ఆ పరీక్షలోనూ ముఖ్యంగా విటమిన్ D పరిమాణం నిర్దేశిత స్థాయి కంటే గణనీయంగా తక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు FSSAI తెలిపింది. ఈ నేపథ్యంలో AWL అగ్రి బిజినెస్ లిమిటెడ్‌పై జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు FSSAI వెల్లడించింది.
ఫోర్టిఫైడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ అంటే ఏమిటి?
సాధారణ సన్‌ఫ్లవర్ ఆయిల్‌తో పోలిస్తే ఫోర్టిఫైడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్లో అదనంగా అవసరమైన పోషకాలను కలుపుతారు. ముఖ్యంగా విటమిన్ A, విటమిన్ D వంటి సూక్ష్మ పోషకాలను నిర్దేశిత ప్రమాణాల ప్రకారం నూనెలో కలపడం ద్వారా ఆహారంలో ఈ పోషకాల లభ్యతను పెంచడం ఫోర్టిఫికేషన్ ఉద్దేశం. అందువల్ల ఫోర్టిఫైడ్ ఉత్పత్తుల్లో ఈ పోషకాల పరిమాణం నిర్ణయించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండటం కీలకం.
పై ఫుడ్స్ ఉత్పత్తులపై కూడా FSSAI చర్యలు
ఇదే సమయంలో మరో ఆహార సంస్థ పై ఫుడ్స్ కు చెందిన రెండు ఉత్పత్తులపై కూడా FSSAI కీలక ఆదేశాలు జారీ చేసింది. లేబులింగ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించిన నేపథ్యంలో ‘Monk Fruit Extract Sweetener’, ‘Monk Fruit Sweetener Drops’ ఉత్పత్తుల అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని సంస్థను ఆదేశించింది. ఈ ఉత్పత్తుల్లో తీపి కోసం చైనాకు చెందిన మాంక్ ఫ్రూట్ అనే పండు నుంచి తీసిన సారాన్ని ఉపయోగించినట్లు సమాచారం.
చెల్లుబాటు అయ్యే లైసెన్స్ తప్పనిసరి
మాంక్ ఫ్రూట్ సారం కలిగిన ఉత్పత్తులను విక్రయించేందుకు అవసరమైన అనుమతులతో కూడిన చెల్లుబాటు అయ్యే FSSAI లైసెన్స్ పొందాలని పై ఫుడ్స్‌కు FSSAI ఆదేశించింది. అనుమతులు, లేబులింగ్ నిబంధనలు, ఆహార భద్రతా ప్రమాణాలను పాటించకుండా సంబంధిత ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ రెండు కేసులపై FSSAI చర్యలు తీసుకున్నట్లు శుక్రవారం సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించింది.
వినియోగదారుల భద్రతపై FSSAI దృష్టి
ఆహార ఉత్పత్తులు నిర్దేశిత నాణ్యత, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడటం FSSAI బాధ్యత. ఉత్పత్తుల్లో పోషకాల పరిమాణం, లేబులింగ్, అనుమతులు, లైసెన్సింగ్ వంటి అంశాల్లో నిబంధనలు పాటించకపోతే సంస్థలు చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ నమూనా విషయంలో విటమిన్ A, D స్థాయిలపై పరీక్షలు నిర్వహించి, తదుపరి ప్రయోగశాల పరీక్షలోనూ విటమిన్ D స్థాయి తక్కువగా ఉన్నట్లు నిర్ధారించడంతో చర్యలు తీసుకున్నట్లు FSSAI తెలిపింది. అదేవిధంగా మాంక్ ఫ్రూట్ ఆధారిత ఉత్పత్తుల విషయంలో లేబులింగ్, లైసెన్సింగ్ నిబంధనలను పాటించాలని పై ఫుడ్స్‌ను ఆదేశించింది.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..