ఏపీలో రాబోయే ఎన్నికల్లో జనం వైసీపీకి బుద్ధి చెబుతారన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ప్రధాన మంత్రి నొక్కిన బటన్ కి మరోసారి నువ్వు నొక్కుడేందయ్యా…లక్షల కోట్లు ఇస్తే రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు.గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయి 8నెలలు దాటింది.జగన్ పరిపాలనలో బాధ్యత కలిగిన అధికారులు పారిపోయారు.పులిచింతలకి , గుండ్లకమ్మ కి గేట్లు పెట్టడం చేతకాదు.ఈ బిడ్డకి 175 సీట్లు కావాలంట.
Read Also: Renuka Chowdary:నేను ఎక్కడి నుండైనా పోటీ చేస్తా..ఆపేదెవరు?
జగన్ కి వచ్చిన 151 సీట్లలో రెండు ఒకట్లు తీసేసి వచ్చే ఎన్నికల్లో ఐదు సీట్లే ప్రజలు ఇస్తారు.ఇప్పటికి ఆరు లక్షల కోట్లకు పైగా అప్పు చేశాడు.తాడేపల్లి నుండి తెనాలి వెళ్లాలంటే హెలికాఫ్టర్ కావాలి.రోడ్ల మీద గుంటలు కనపడతాయని హెలికాఫ్టర్ లో తిరుగుతున్నాడు.ఇరిగేషన్ మంత్రి డ్యాన్సులు, వ్యవసాయ శాఖ మంత్రి సీబీఐ ఫైల్స్, కాకాని కోర్టు ఫైల్స్.బాబాయి హత్య కేసులో దోషుల్ని కాపాడే వ్యక్తి పరిపాలనకి అర్హుడా అని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుని గోదావరిలో ముంచేశారు.మేధావులు మౌనంగా ఉంటే అరాచక శక్తులు రాజ్యమేలుతాయి. మేధావులు, గ్రాడ్యుయేట్లు ధైర్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కుని వినియోగించుకోవాలన్నారు దేవినేని ఉమా.
Read Also:Health Benefits Of Beer: బీర్ తాగడం వల్ల 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..