Nimmala Ramanaidu : తుఫాన్ ‘మొంథా’ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వరదల ప్రమాదం పెరుగుతోంది. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ పరిసర ప్రాంతాలు ఉద్రిక్తతతో ఉన్నాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా కృష్ణా నది ఉపనదులకు వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, పరిస్థితిని సమీక్షించిన మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ వద్ద సుమారు 6.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే, బుడమేరుపై…
కృష్ణమ్మ పరుగులు తీస్తోంది.. కృష్ణా బేసిన్ లోని అన్ని ప్రాజెక్టులు నిండిపోవడంతో.. ప్రకాశం బ్యారేజీ వైపు పరుగులు తీస్తోంది కృష్ణమ్మ.. అయితే, అంతకంతకు నీటి ప్రవాహం పెరుగుతుండడంతో.. అధికారులు అప్రమత్తం అయ్యారు.. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం పెరుగుతోన్న నేపథ్యంలో.. మొత్తం 70 గేట్లను ఎత్తివేశారు అధికారులు..
Prakasam Barrage Flood Alert: ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద నీరు ఉద్ధృతి కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నదీపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరదకు అనుగుణంగా అధికారులు నీటిని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.
ఎట్టకేలకు ప్రకాశం బ్యారేజీ వద్ద భారీ బోటు తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది. ఓ భారీ బోటును బయటకు తీయగలిగారు. ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర నీటిలో చిక్కుకున్న 40 టన్నుల బరువున్న భారీ బోటును బెకెం ఇన్‌ఫ్రా సంస్థ ఇంజినీర్లు విజయవంతంగా ఒడ్డుకు చేర్చారు.
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపును మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత పరిశీలించారు. ఇంజనీర్లను బోట్ల తొలగింపు ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రులు. జరిగిన బోటు తొలగింపు విధానాలను హోంమంత్రి వంగలపూడి అనితకి వివరించారు నిమ్మల. ఈ సంద్రాభంగా హోమ్ మంత్రి మాట్లాడుతూ.. జత్వానీ కేసులో ఎవరినీ బలిపశువులను చేయడం లేదు., గత ప్రభుత్వంలో బలి పశువులను చేసారు. బోట్ల తొలగింపుకు అన్నిరకాల సహకారం అందిస్తాం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను వినియోగించుకోవచ్చు.…
ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లను తొలగించేందుకు H బ్లాక్ ఆపరేషన్ ప్రారంభమైంది. నీళ్లలో నుంచి బోట్లను తొలగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌కు అడ్డం పడిన బోట్ల తొలగింపు.. రోజురోజుకు క్లిష్టంగా మారుతోంది.
Prakasam Barrage: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ ఆరవ రోజు కొనసాగుతుంది. డబుల్ ఐరన్ రోప్ పను డోజర్ కు కనెక్ట్ చేసి బోట్లను లాగే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న లోడ్ హెవీ కావడంతో లోడ్ యాక్సిల్ విరిగిపోయింది. ఇవాళ సరాసరి భూమిలోకి వేసిన స్తంభానికి కనెక్ట్ చేసి డోజర్ తో లాగే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద జలవనరుల శాఖ బోట్ల తొలగింపు ప్రక్రియను జలవనరుల శాఖ చేపట్టింది. ప్రస్తుతం పడవల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. గేట్ల వద్ద చిక్కుకున్న భారీ పడవలను క్రేన్ల సాయంతో తీయడం సాధ్యం కాకపోవడంతో ముక్కలు చేసి తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.