టీడీపీ నాయకత్వం అసహనంతో ఉంది అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి,సంక్షేమాన్ని చూసి ప్రతిపక్షం తట్టుకోలేక పోతోంది. ఇక “దిశ”ను అవమానించడం రాజద్రోహం కింద పరిగణించాలి అని తెలిపారు. అటువంటి వారిని రాజకీయాల నుంచి బహిష్కరించాలి అని పేర్కొన్నారు. మహిళా హోం మంత్రిపై టీడీపీ నేతల వ్యాఖ్యలు వారి సంస్కారాన్ని బయటపెట్టింది అన్నారు. ఇక టీడీపీ హయాంలో మహిళలపై చాలా దాడులు జరిగాయి. మహిళలను గౌరవించే సంస్కారం వాళ్లకు లేదు అని చెప్పారు మంత్రి ఆదిమూలం సురేష్.
అయితే నేడు ప్రారంభమైన హాయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డ్ సమావేశంకు ముఖ్యఅతిథిగా మంత్రి ఆది మూలం సురేష్ హాజరయ్యారు. ఉన్నత విద్యలో సంస్కరణ లు, యూనివర్శిటీల మధ్య అనుసంధానం, బలోపేతంపై సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు రెండో బోర్డు సమావేశం జరగనుంది.