మంత్రి అంటే అభిమానులు.. అనుచరులు కామన్. కొందరు మంత్రి చెప్పిన పనిచేస్తే.. ఇంకొందరు తమ అభిమాన నేతపై ఈగ వాలితే సహించలేరు. ప్రస్తుతం ఆ మినిస్టర్ విషయంలో అదే జరుగుతోందట. అభిమానం తలనొప్పులు తెచ్చిపెడుతోందని టాక్. తాజా ఎపిసోడ్‌లో విపక్షాలకు టార్గెట్‌గా మారి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఆ అమాత్యులవారు. సుబ్బారావు గుప్తాపై దాడి ఘటనతో రచ్చ రచ్చ..! బాలినేని శ్రీనివాస్‌రెడ్డి. ఏపీ మంత్రి. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆయన చుట్టూనే విమర్శలు.. ప్రతివిమర్శలు నడుస్తున్నాయి. గతంలోనూ ఆయన…
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు, నటుడు నాగబాబు స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో సుదీర్ఘమైన పోస్టును పెట్టారు. ఏపీలో రాజకీయ భవిష్యత్‌ను తలుచుకుని బాధపడాలో లేదా భయపడాలో తెలియని దుస్థితి నెలకొందని ఆయన వాపోయారు. చంద్రబాబు తమకు ప్రత్యర్థి అయ్యి ఉండొచ్చని… కానీ చంద్రబాబు లాంటి సీనియర్ నేత కన్నీటి పర్యంతం కావడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని నాగబాబు ఆవేదన వ్యక్తం…
పదవి వచ్చిన మూడు నెలలకే ఆయన మూడ్ ఆఫ్ అయింది. ఛైర్మన్ పోస్ట్ ఉన్నట్టా.. లేనట్టా అని ఒక్కటే అనుమానం. కనీసం కుర్చీ కూడా లేదు. దీంతో లబోదిబోమంటున్నారట ఆ నాయకుడు. ఆయనెవరో.. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఛైర్మన్ పదవి ఇచ్చారు.. కుర్చీ లేదు..! రాజమండ్రి స్మార్ట్ సిటీ చైర్మన్‌గా వైసీపీ నేత చందన నాగేశ్వర్‌ను నియమించి మూడు నెలలైంది.ఇంతవరకు ఆయన బాధ్యతలు చేపట్టలేదు. ఇందుకు కారణం పదవి ఇష్టం లేక కాదు.. పదవి ఇచ్చారు…
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలపై పగబట్టారు అని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. గుజరాత్ లో డ్రగ్స్ పట్టుబడితే ప్రభుత్వంపై టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వంలో ఉండే పెద్దలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే వైసీపీ చూస్తూ ఉరుకోదు. రాజకీయాలు చేయడానికి శవాలు ఎక్కడ దొరుకుతాయా…అని ఎదురు చూసే పరిస్థితికి ప్రతిపక్షం దిగజారింది. హెరిటేజ్ వాహనంలో…
టీడీపీ నాయకత్వం అసహనంతో ఉంది అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి,సంక్షేమాన్ని చూసి ప్రతిపక్షం తట్టుకోలేక పోతోంది. ఇక “దిశ”ను అవమానించడం రాజద్రోహం కింద పరిగణించాలి అని తెలిపారు. అటువంటి వారిని రాజకీయాల నుంచి బహిష్కరించాలి అని పేర్కొన్నారు. మహిళా హోం మంత్రిపై టీడీపీ నేతల వ్యాఖ్యలు వారి సంస్కారాన్ని బయటపెట్టింది అన్నారు. ఇక టీడీపీ హయాంలో మహిళలపై చాలా దాడులు జరిగాయి. మహిళలను గౌరవించే సంస్కారం వాళ్లకు లేదు అని…