బర్డ్ ప్లూ గోదావరి జిల్లాలను వణికిస్తోంది. బర్డ్ ఫ్లూ పేరు చెప్తేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. కోళ్లకు సోకిన ఈ వైరస్.. కొన్ని రోజుల్లోనే లక్షలాది కోళ్లను బలి తీసుకుంది. ఈ కోళ్లను పరీక్షించిన భూపాల్‌లోని హై సెక్యూరిటీ ల్యాబ్ రిపోర్ట్ సైతం.. దీనిని బర్డ్ ఫ్లూ వైరస్‌గా నిర్ధారించింది. ఈ వైరస్ కోళ్ల నుండి మనుషులకు కూడా సంక్రమించే అవకాశం ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది.
కోళ్లకు అంతుచిక్కని వ్యాధిపై గోదావరి జిల్లాల పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని పౌల్ట్రీలకు ఈ వ్యాధి లేకపోయినా కొన్నిచోట్ల జాడ కనిపిస్తుంది. అంతుచిక్కని వైరస్ కోళ్లకు వ్యాపించడంతో పౌల్ట్రీ రైతులు ఆందోళనలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్-ఒడిశా మధ్య కోడి గుడ్ల వివాదం ఇంకా చల్లారలేదు. ఒడిశాలోని కుర్ధా రోడ్ వద్ద ఏపీకి చెందిన కోడిగుడ్ల లారీలను ఒడిశా పౌల్ర్టీ రైతులు, ట్రేడర్స్ అడ్డుకున్నారు. సుమారు రెండు వందల కోడిగుడ్ల లారీలు జాతీయరహాదారిపై నిలచిపోయాయి. ఏపీ ఎగ్ ట్రేడర్స్ తో చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. ఎండ వేడికి గుడ్లు పాడవుతాయని ఆంధ్ర రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేతల ధరలు పెరుగుతుండటం, గుడ్డు ధర పెరగకపోవడంతో ఒడిశా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రల…