Spiritual Pilgrimage Bus Tour: ఒకేరోజులో పంచారామ క్షేత్రాల సందర్శన.. అధ్యాత్మిక యాత్రకు మంత్రి దుర్గేష్ శ్రీకారం..
- వారాంతంలో ప్రముఖ అధ్యాత్మిక కేంద్రాల సందర్శన..
- పంచారామ క్షేత్రాలు సందర్శించేలా ఒక రోజు అధ్యాత్మిక యాత్ర..
- శ్రీకారం చుట్టిన మంత్రి కందుల దుర్గేష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Spiritual Pilgrimage Bus Tour: పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారాంతంలో ప్రముఖ అధ్యాత్మిక దేవాలయాలు, పంచారామ క్షేత్రాలు సందర్శించేలా ఒక రోజు అధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చూట్టారు. ఆధ్యాత్మిక యాత్ర బస్సును రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం రాజమండ్రి సరస్వతీ ఘాట్ వద్ద ఉన్న టూరిజం శాఖ ఇన్ఫర్మేషన్ అండ్ రిజర్వేషన్ కౌంటర్ కార్యాలయం వద్ద నుండి ఆధ్యాత్మిక యాత్ర బస్సు బయలుదేరింది.
Read Also: Aravind Kejriwal : ప్రభుత్వ వసతి కల్పించాలని హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్
Also Read
- MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
- CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
- Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్ కొట్టివేసిన కోర్టు..
- Governor Abdul Nazeer: నేడు ఆదికవి నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా గవర్నర్
ఇక, ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అసెంబ్లీలో శాసనసభ్యుల సూచనల మేరకు ప్రణాళిక ఈ యాత్ర ఏర్పాటు చేశామని అన్నారు. భక్తులకు అధ్యాత్మిక సాంత్వనను అందించేందుకు 6 పుణ్య క్షేత్రాలతో అధ్యాత్మిక యాత్రను పర్యాటకులకు అందిస్తున్నామని తెలిపారు.. కోరుకొండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి ఆలయాలను కలుపుతూ సాగే యాత్రకు ప్రతి శనివారం అందుబాటులో బస్సులు ఉంటాయన్నారు. పర్యాటకుల రద్దీ, డిమాండ్ దృష్ట్యా ఆదివారం కూడా బస్సులు ఏర్పాటు చేసే యోచన ఉందని వెల్లడించారు. ఈ బస్సుల్లో పెద్దలకు రూ.1,000, 3-10 ఏళ్ల వయస్సు గల చిన్నారులకు 800 రూపాయలుగా టికెట్ ధరలను నిర్ణయించారు.. ప్రకృతి రమణీయత, అధ్యాత్మిక కలయికగా ఉన్న టూర్ ప్యాకేజీని యాత్రికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి దుర్గేష్ కోరారు. అధ్యాత్మిక భావంతో పాటు సాంస్కృతిక, చారిత్రాత్మిక ప్రదేశాలకు మరింత వెలుగులు అద్దడమే టూర్ ప్యాకేజీ ముఖ్యోద్దేశమని అన్నారు మంత్రుల కందుల దుర్గేష్..
తాజావార్తలు
-
Tamil Nadu: షాకింగ్.. 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన మైనర్ స్నేహితులు
-
Kamal Haasan: స్టార్ హీరోల కళ్ళు తెరిపించిన కమల్ హాసన్.. నెట్టింట ప్రశంసల వెల్లువ!
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
-
Jananayagan : కళ్లు చెదిరే రేటుకు ‘జననాయగన్’ తెలుగు రైట్స్?
-
Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!