బాలీవుట్ నట దిగ్గజం రాజ్ కపూర్ మనవరాలిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది కరీనా కపూర్. 2000వ సంవత్సరంలో ‘రెఫ్యూజీ’ అనే సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టి తన క్యూట్ లుక్, యాక్టింగ్స్‌తో తొలి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న కరీనా. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అలా అనతి కాలంలో బాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టి, స్టార్ హీరోయిన్‌గా భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. ఇక ఈ దశలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌తో ప్రేమలో పడ్డ కరీనా ఆయనతో కొన్నాళ్లు డేటింగ్ చేసి అనంతరం అక్టోబర్ 16, 2012లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. దీంతో పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతలతో మధ్యలో సినిమాలకు గ్యాప్ వచ్చిన కరీన ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి, గుర్తింపు ఉన్న పాత్రలు చేస్తోంది. అయితే తాజాగా కరీనా కపూర్ ఓ ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది..
Also Read: Pushpa 3 : ‘పుష్ప-3’లో ఇద్దరు స్టార్స్..ఇందులో నిజమెంత!
ఎంత పెద్ద సెలబ్రెటీలు హీరో హీరోయిన్లు కూడా మనలాంటి మనుషులే. వాళ్లకు కూడా ఇష్టాయిష్టాలు, అలవాట్లు ఉంటాయి. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే కరీనా కపూర్ ఇటీవల ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ‘నాకు కిచిడి అంటే చచ్చేంత ఇష్టం.. అది లేకుండా నేను ఉండలేను. కనీసం వారానికి ఐదు సార్లైనా ఇంట్లో వండుతా.. అప్పుడు కానీ నాకు నిద్ర పట్టదు. సైఫ్ అరుస్తాడు అస్తమానం కిచిడి ఎంటీ అని. నా వరకు ప్రిపేర్ చేసుకుని తింట. అంత ఇష్టం నాకు కిచిడి అంటే ’ అని తెలిపింది..