టీడీపీ అధికార ప్రతినిధి, సినీనటి దివ్యవాణి రాజీనామా అంశంలో పార్టీలో ఆసక్తికర పరిణామాలు జరిగాయి. ఆమె మూడు నాలుగేళ్ల క్రితమే పసుపు కండువా కప్పుకొన్నా.. దివ్యవాణికి ఉన్న సినీ గ్లామరుతో పార్టీలో.. ప్రజల్లో ఇమేజ్ సంపాదించారు. ఆమెకు టీడీపీ ప్రాధాన్యం ఇచ్చింది. ఈ క్రమంలో వైసీపీపైనా.. మంత్రులపైనా ఘాటైన విమర్శలు చేశారు దివ్యవాణి. అయితే మహానాడులో దివ్యవాణికి మాట్లాడే అవకాశం దక్కలేదు. దీంతో ఆమె అలకబూనారు. కావాలనే తనను పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారని కామెంట్స్ చేశారు.…
టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి యూటర్న్ తీసుకున్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఉదయం ట్వీట్ చేసిన ఆమె మధ్యాహ్నానికి ఆ ట్వీట్లను డిలీట్ చేశారు. పార్టీలో తనకు ఉన్న సమస్యలపై చంద్రబాబు, లోకేష్‌లతో మాట్లాడతానని ప్రకటించారు. వర్రా రవీందర్ రెడ్డి పేరుతో వచ్చిన ఓ పోస్టింగ్ ఆధారంగా తొలుత తాను పార్టీకి రాజీనామా చేశానని దివ్యవాణి వివరణ ఇచ్చారు. టీడీపీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు పేరుతో దివ్యవాణిని సస్పెండ్ చేసినట్టుగా ఫేస్ బుక్‌లో…