భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. జేపీ నడ్డా 13 రోజుల క్రితం (ఫిబ్రవరి 20వ) తేదీన గుజరాత్ నుండి రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జేపీ నడ్డా ఇంతకుముందు హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.
వనపర్తి అసెంబ్లీ స్థానాన్ని ఆశించిన టీఎస్ ఆర్టీసీ టీఎంయూ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు.
మహిళను తొలగించి వస్తావా.. ఇన్ని రోజులు కేటీఆర్ తన దోస్తు కోసం అభివృద్ధి చేయలేదు అని ఎమ్మెల్యే రేఖానాయక్ ఆరోపించారు. నేను పార్టీలో ఉండను.. మహిళలకు బీఆర్ఎస్ లో చోటులేదు.. రాజీనామా చేస్తున్నాను అంటూ ఆమె వెల్లడించారు.
టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి యూటర్న్ తీసుకున్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఉదయం ట్వీట్ చేసిన ఆమె మధ్యాహ్నానికి ఆ ట్వీట్లను డిలీట్ చేశారు. పార్టీలో తనకు ఉన్న సమస్యలపై చంద్రబాబు, లోకేష్‌లతో మాట్లాడతానని ప్రకటించారు. వర్రా రవీందర్ రెడ్డి పేరుతో వచ్చిన ఓ పోస్టింగ్ ఆధారంగా తొలుత తాను పార్టీకి రాజీనామా చేశానని దివ్యవాణి వివరణ ఇచ్చారు. టీడీపీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు పేరుతో దివ్యవాణిని సస్పెండ్ చేసినట్టుగా ఫేస్ బుక్‌లో…
ఏపీ బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సోమవారం నాడు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడుతున్నట్లు రావెల కిషోర్ బాబు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు లేఖ పంపారు. కొంతకాలంగా బీజేపీ కార్యక్రమాలకు రావెల కిషోర్‌బాబు దూరంగా ఉంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరిన రావెల ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. Somu Veerraju:…
సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన కలెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను హైదరాబాద్‌లోని తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌లోని సీఎస్ సోమేష్ కుమార్‌కు అందజేశారు. ఆయన త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే ఏడాది కలెక్టర్‌గా రిటైర్డ్ కానుండగా ఒక ఏడాది ముందే వెంకట్రామిరెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. Read Also: రాములవారి కంట కన్నీరు… ఆందోళనలో…