పశ్చిమబెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ఒడిశాకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. అర్ధరాత్రి విద్యార్థినులు ఎందుకు బయటకు వెళ్తున్నారని.. ప్రైవేటు యాజమాన్యాలు శ్రద్ధ తీసుకోవాలని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి.
రెస్టారెంట్, తినుబండారాల యజమానులు గుర్తింపును తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ హిమాచల్‌ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఆహార భద్రత, పరిశుభ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రకటనపై వ్యాపారుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
వినేశ్ ఫోగట్ తన రిటైర్మెంట్ పై శుభవార్త చెప్పింది. తన ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, శుక్రవారం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. రెజ్లింగ్‌లో పునరాగమనం చేయబోతున్నట్లు ఒక హింట్ ఇచ్చింది. 2032 వరకు ఆడాలనుకున్నట్లు వినేశ్ చెప్పింది.
పశ్చిమబెంగాల్‌లో నడిరోడ్డుపై ఓ జంటపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత దాడి చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మమతాబెనర్జీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదంటూ పెద్ద ఎత్తున బీజేపీ విమర్శలు గుప్పించింది.
టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి యూటర్న్ తీసుకున్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఉదయం ట్వీట్ చేసిన ఆమె మధ్యాహ్నానికి ఆ ట్వీట్లను డిలీట్ చేశారు. పార్టీలో తనకు ఉన్న సమస్యలపై చంద్రబాబు, లోకేష్‌లతో మాట్లాడతానని ప్రకటించారు. వర్రా రవీందర్ రెడ్డి పేరుతో వచ్చిన ఓ పోస్టింగ్ ఆధారంగా తొలుత తాను పార్టీకి రాజీనామా చేశానని దివ్యవాణి వివరణ ఇచ్చారు. టీడీపీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు పేరుతో దివ్యవాణిని సస్పెండ్ చేసినట్టుగా ఫేస్ బుక్‌లో…
రోడ్డుపై నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక ఘాట్ రోడ్లపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని డ్రైవింగ్ చేయాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు గోవిందా అంటాయి. చిన్న ఇరుకైన కొండ మలుపుల్లో ప్రయాణం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అలాంటి చోట్ల యూటర్న తీసుకోవడం అంటే చాలా కష్టం. ఇలాంటి కష్టమే ఓ వ్యక్తికి వచ్చింది. ఇరుకైన మార్గం ద్వారా కొండ అంచు చివరి వరకు వెళ్లిన ఓ కారు అక్కడి నుంచి యూటర్న్ చేసుకోవడానికి నానా…