Dengue Danger in Kakinada: కాకినాడలో డెంగీ, టైఫాయిడ్ డేంజర్ బెల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకినాడ జిల్లాలో డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. డెంగీతో పాటు మలేరియా టైఫాయిడ్ వంటి వైరల్ ఫీవర్ల తో హాస్పటల్స్ కి క్యూ కడుతున్నారు జనాలు. ఇప్పటికే గత నెల రోజులుగా డెంగ్యూ తో ప్లేట్ లెట్స్ పడిపోయి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.. ప్రభుత్వ ఆసుపత్రిలలో బెడ్ లు ఖాళీ లేక తిప్పలు పడుతున్నారు. వర్షా కాలం సీజన్ లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదు అవుతూ ఉంటాయి..ఈ ఏడాది ఇప్పటివరకు అధికారికంగా జిల్లాలో 309 డెంగీ కేసులు నమోదు కాగా,ఆందులో గత నెల రోజుల్లోనే 250 కి పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది… అనధికారికంగా ఈ లెక్కలు 1000 కి పైనే ఉంటాయి.. రోజులు గడుస్తున్న జ్వరం తగ్గక ప్లేట్ లెట్స్ పడిపోయి ఇబ్బందులు పడుతున్నారు.. గ్రామాలు, అర్బన్ ఏరియాలు అనే తేడా లేకుండా బాధితులు రోజు రోజుకి పెరుగుతున్నారు… పరిస్థితి విషమిస్తే కాకినాడ జిజిహెచ్ కి వస్తున్నారు బాధితులు… దాంతో గత పది రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలో డెంగీ బాధితుల ఫ్లోటింగ్ పెరిగింది.
ఇప్పటికే రోగుల సంఖ్య పెరగడంతో 100 బెడ్ల తో ప్రత్యేక డెంగీ వార్డ్ ఏర్పాటు చేశారు.. అయినా గాని రోగులు తాకిడికి అది సరిపోవడం లేదు.. దాంతో ఏం చేయలేని సిబ్బంది ఒక్కొక్క బెడ్ పై ఇద్దరు పేషెంట్లను ఉంచుతున్నారు… అలాంటి సందర్భాల్లో వారికి ట్రీట్మెంట్ చేయడానికి సెలైన్లు పెట్టడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు… పేషంట్ లతో పాటు ఉన్న సహాయకులు కూడా ఉండడానికి అవకాశం లేకుండా పోతుంది.. జిల్లాలో డెంగీ బాధితుల్లో చిన్నపిల్లలే ఎక్కువగా ఉంటున్నారు… జ్వరం తలనొప్పి ఒళ్ళు నొప్పులతో తీవ్ర అలసటకి గురవుతున్నారు… కొంతమందిలో ప్లేట్లెట్స్ అప్పటికప్పుడు డౌన్ అయిపోవడంతో ప్రాణాల మీదకి వస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి.. ఇంట్లో పిల్లల్లో ఒకరికి వచ్చి తగ్గేలోపు మరొకరు డెంగీ బారిన పడుతున్నారు.. ఆర్థికంగా ఉన్నవాళ్లు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నప్పటికీ సామాన్యులు రోజుల తరబడి టెస్టుల కోసమే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది.
Also Read
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
దోమకాటుతో అనేక మంది జ్వరాల బారిన పడుతున్నారు.. వర్షాలు కురుస్తుండడంతో నిలువ నీరు పెరిగిపోయి దోమలు వృద్ధి చెందుతున్నాయి… ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆర్ఎంపి క్లినిక్ లు పెద్ద ఆసుపత్రుల వరకు రోగుల తాకిడి గత నెల రోజులుగా పెరిగింది ఈ వైరల్ ఫీవర్ సీజనల్ వ్యాధులు మరొక రెండు నెల రోజుల వరకు ఉంటాయని డాక్టర్లు చెప్తున్నారు… దొరికిందే అదునుగా ప్రైవేటు ఆసుపత్రులు రోగుల దగ్గర్నుంచి పీల్చి పిప్పి చేస్తున్నాయి… రకరకాల టెస్టులు పేరుతో అందిన కాడికి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలలో టెస్ట్ రిపోర్టులు రోజులు తరబడి రాకపోవడంతో ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఎందుకని ముందుగానే ప్రైవేట్ హాస్పటల్స్ కి పరుగులు పెడుతున్నారు .. ప్లేట్లెట్స్ పడిపోయి అవయవాలు పనిచేయక రక్తం కక్కుకునే స్థాయి లో ఉంటే డెంగ్యూ తీవ్రత ఎక్కువగా ఉంటుంది… ప్రైవేట్ ల్యాబ్ ల దగ్గర రక్త పరీక్షల కోసం బారులు తీరుతున్నారు పేషెంట్లు.. గత కొద్ది రోజులుగా కాకినాడ జిజిహెచ్ లో ఓపితో పాటు పేషంట్లు జాయినింగ్ సంఖ్య కూడా పెరుగుతుంది.. ఇద్దరు పేషెంట్లు డిశ్చార్జ్ అవుతుంటే కొత్తగా నలుగురు జాయిన్ అవ్వడానికి సిద్ధమవుతున్నారు.
Read Also: Chikkudu Vamshi Krishna: రైతులకు 24 గంటలు విద్యుత్ ఏమోగానీ.. కనీసం 16 గంటలైనా సరఫరా చేస్తారా?
కాకినాడ,పెద్దాపురం, సామర్లకోట, తుని, పిఠాపురం ఏరియాలలో బాధితులు ఎక్కువగా ఉన్నారు.. స్వల్ప లక్షణాలు ఉన్నవారు ఇంటి దగ్గరే ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు.. గత మూడేళ్లుగా చూస్తే ఈ ఏడాది ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి.. అది ఏ ఫీవరో తెలుసుకుని ట్రీట్మెంట్ మొదలు పెట్టేలోపే దాని తీవ్రతతో రోగుల అవస్థలు పడుతున్నారు.. కొంతమందిలో డెంగ్యూ మలేరియా కలిపి అటాక్ చేస్తుంది.. శారీరకంగా వీక్ గా ఉన్నవాళ్లు తట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. మొత్తానికి డెంగీ వైరల్ ఫీవర్ లతో జిల్లాలో ప్రజలు వణికిపోతున్నారు. ప్రతి ఇంట్లోనూ ఒక పేషెంట్ ఉండడం కామన్ అయిపోయింది.. జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేక డెంగీ వార్డు ఏర్పాటు చేసిన వచ్చే పేషెంట్లకు ఆ బెడ్లు సరిపోవడం లేదు. దాంతో ట్రీట్మెంట్ అందించడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు.. ఇప్పటినుంచే అప్రమత్తమై పేషెంట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే వైరల్ ఫీవర్లు మరింత పెరిగితే ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరుగుతుంది… జనరల్ విజిటింగ్ కి వచ్చిన వాళ్ళు సైతం అప్పటికప్పుడు అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
తాజావార్తలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్‌డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్‌ప్లేతో అదిరిపోయే ఫోన్.!