Hyderabad Gymkhana: టికెట్ల కోసం పోటెత్తిన జనం.. భారీ క్యూ లైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huge Crowd Gathers At Hyderabad Gymkhana For Ind vs Aus Match Tickets: సెప్టెంబర్ 25వ తేదీన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే! మూడేళ్ల విరామం తర్వాత ఈ మైదానం అంతర్జాతీయ మ్యాచ్‌కి అతిథ్యం ఇవ్వనుండడంతో, టికెట్ల కోసం జనాలు పోటెత్తారు. ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకం గురువారం చేపట్టనున్నట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రకటించడంతో.. సికింద్రాబాద్‌లోని జిమ్‌ఖానా మైదానానికి భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు అమ్మకాలు కొనసాగుతాయని హెచ్‌సీఏ పేర్కొనడంతో.. రాత్రి నుంచే జనాలు క్యూ కట్టడం మొదలుపెట్టారు.

Also Read
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఇదిలావుండగా.. తొలుత ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకంపై విషయంపై గందరగోళ వాతావరణం నెలకొంది. మొదట పేటీఎం వేదికగా టికెట్లు అమ్మినట్టు హెచ్‌సీఏ పేర్కొంది. అయితే.. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ అవ్వడం లేదంటూ చాలామంది ఫిర్యాదు చేశారు. క్రీడాభిమానుల తమ ఆందోళన వ్యక్తం చేశారు. 39 వేల టికెట్లు ఏమయ్యాయంటూ బుధవారం అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. ఈ తరుణంలోనే జిమ్‌ఖానా మైదానంలో టికెట్ల అమ్మకం అంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో.. ఉదయం 7 గంటలకే వేలాది సంఖ్యలో జనాలు చేరుకున్నారు. అయితే.. గేట్లు మూసి ఉండటం, అధికారులెవరూ లేకపోవడంతో ఫ్యాన్స్ గేట్లు దూకి లోపలికి ప్రవేశించారు. కొందరు మైదానంలోకి దూసుకెళ్లి.. ‘హెచ్‌సీఏ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు తీశారు. అప్పుడు హెచ్‌సీఏ అధికారులు దిగి రావడం, గురువారం టికెట్లు అమ్ముతామని హామీ ఇవ్వడంతో అభిమానులు శాంతించారు.

ఇలా టికెట్ల విషయంలో గందరగోళం నెలకొనడంతో.. తెలంగాణ క్రీడామంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా హెచ్చరించారు. టీ20 మ్యాచ్ టికెట్లపై అవకతవకలపై విచారణ జరుపుతామని, బ్లాక్‌లో టికెట్లు అమ్మినట్టు తేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ టికెట్ల వ్యవహారంపై క్రీడా, పోలీస్ శాఖలు నిఘా ఉంటాయని.. హెచ్‌సీఏ కేవలం పది మంది అనుభవించడం కోసం కాదని.. ఉప్పల్ స్టేడియంకు ప్రభుత్వం 23 ఎకరాలు విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర పరువు తీసేలా వ్యవహరించొద్దని అన్నారు.
తాజావార్తలు
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!