Dangerous Stunts on Road: పోలీసుల నిర్లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువకులు పెట్రేగిపోతున్నారు. తాజాగా, విజయవాడ- గుంటూరు హైవేపై ఓ యువకుడు చేసిన స్టంట్స్ భయంకరంగా ఉన్నాయి. హైవేపై ద్విచక్ర వాహనం (స్కూటీ) పై స్టంట్స్ చేస్తున్న యువకుడు తోటి వాహనదారులు, ప్రయాణికులను భయాందోళనలు కలిగించాడు. స్కూటీ మీద పడుకొని, చేతులు వదిలి పెట్టి, ప్రమాదకరమైన రీతిలో విన్యాసాలు చేస్తున్న అతడి చర్యల వల్ల రోడ్డు మీద ప్రయాణించే వారికి ప్రమాదం పొంచి ఉందని స్థానికులు పేర్కొన్నారు. ఇలాంటి నిర్లక్ష్యమైన ప్రవర్తన కలిగిన వాళ్లు వెహికిల్స్ డ్రైవ్ చేయడం వల్ల ఇతరులకు ముప్పు కలిగించకుండా పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Pakistan Foreign Loans: ప్రపంచ దేశాలకు వంగి వంగి దండాలు పెడుతున్న పాక్.. దాని కోసమేనా?
అయితే, విజయవాడ- గుంటూరు హైవేపై ఈ యువకుడు చేసిన విన్యాసాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఇది పోలీసుల వద్దకు చేరడంతో నెంబర్ ఆధారంగా ఆ యువకుడి వివరాలను సేకరిస్తున్నారు. యువత ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.