వైఎస్‌ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీ కొని ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి వైపు నుంచి మితిమీరిన వేగంతో వచ్చిన స్కార్పియో వాహనం.. ఆర్టీసీ బస్సు, పోలీసు రక్షక వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్కార్పియోలో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులను నంద్యాల జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన…