మహేశ్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ‘ఎన్టీఆర్’ చీఫ్ గెస్ట్ గా వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. అదేంటి ఒక స్టార్ హీరో సినిమాకి ఇంకో స్టార్ హీరో గెస్ట్ గా ఎలా వస్తాడు? అంటూ ఆశ్చర్యపోయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. గ్రాండ్ గా జరిగిన భరత్ అనే నేను ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్, మహేశ్ బాబుల మధ్య ఉన్న స్నేహాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. ఇద్దరు స్టార్ హీరోలు ఎలాంటి ఇగోలు లేకుండా ఇంత క్లోజ్ గా ఉంటారా అని సర్ప్రైజ్ అయ్యారు. ఆ స్టేజ్ పై నందమూరి, ఘట్టమనేని అభిమానుల ముందు నిలబడి మహేశ్ బాబు ‘మేము మేము బాగానే ఉంటాం… మీరు ఇంకా బాగుండాలి’ అని అభిమానులకి చెప్పాడు. ఫాన్స్ వార్స్ గురించి మహేశ్ పరోక్షంగా చెప్పిన మాటని మరోసారి గుర్తు చేసుకోవాల్సిన సమయం వచ్చింది.
మహేశ్ బాబు, అల్లు అర్జున్ ఫాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతూ ఉంటుంది. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలు ఒకే సీజన్ లో రిలీజ్ అవ్వడంతో ఈ ఫ్యాన్ వార్ మరింత పెరిగింది. మా హీరో గొప్ప అంటే కాదు మా హీరోనే గొప్ప అంటూ ట్విట్టర్ లో మహేశ్, అల్లు అర్జున్ ఫాన్స్ వెర్బల్ వార్ కి దిగుతూ ఉంటారు. ఈ వార్ చేసే వాళ్లకి షాక్ ఇస్తూ మహేశ్ బాబు, బన్నీలు ఒకే వేదికపై కనిపించారు. డైరెక్టర్ గుణశేఖర్ కూతురు ‘నీలిమ’ పెళ్లి ‘రవి’ అనే బిజినెస్ మాన్ తో ఇటివలే ఘనంగా జరిగింది. ఈ వెడ్డింగ్ రిసెప్షన్ ని హైదరాబాద్ లో గుణశేఖర్ గ్రాండ్ గా చేశాడు. ఈ రిసెప్షన్ లో మహేశ్ బాబు, అల్లు అర్జున్ కలిసారు. ఇద్దరు హీరోలు కొత్త జంటకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంధర్భంగా మహేశ్ బాబు, అల్లు అర్జున్ ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటో ఒకటి బయటకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో చూసాక అయినా ఫాన్స్ వార్ కి ఎండ్ కార్డ్ పడుతుందేమో చూడాలి.