Manoj Tiwary Says Sorry After Backlash For Jhukega Nahi Sala: ‘పుష్ప’ సినిమాలోని ‘తగ్గేదే లే’ డైలాగ్ ఎంతలా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. క్రీడాకారులు, రాజకీయ నాయకులు సైతం.. వీరోచిత సమయాల్లో ఈ డైలాగ్‌ని వినియోగిస్తున్నారు. గెలిచినప్పుడో, ఛాలెంజ్ చేసినప్పుడో.. ఈ డైలాగ్‌ని ప్రతిఒక్కరూ వాడేస్తున్నారు. ఇప్పుడు తాజాగా క్రికెటర్ నుంచి పొలిటీషియన్‌గా అవతారమెత్తిన మనోజ్ తివారీ కూడా ఈ డైలాగ్‌ని ఓ సందర్భంలో వినియోగించాడు. కాకపోతే, ఇతని విషయంలో మాత్రం అది వివాదాస్పదమైంది. బీజేపీకి సవాల్ చేస్తూ.. ‘‘ఝుకేగా నహీ సాలా’’ అని చెప్పడంతో ఇతనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో.. అతగాడు దిగొచ్చి ‘క్షమాపణలు’ చెప్పాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే..
CPI Ramakrishna: సీఎం జగన్ కి రామకృష్ణ లేఖ.. రైతుల్ని ఆదుకోండి
వెస్ట్ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో స్పోర్ట్స్ మినిష్టర్‌గా కొనసాగుతున్న మనోజ్.. ఆదివారం టీఎంసీ ర్యాలీలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా హౌరా మైదాన్ అసెంబ్లీ స్టేజ్‌పై ప్రసంగించాడు. పార్టీ ఫాలోవర్లందరూ ఏకతాటిపై ఉండాలని, అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరుతూ.. బీజేపీకి సవాల్ విసిరాడు. ‘ఝుకేగా నహీ సాలా’ (ఏదేమైనా తగ్గేదే లే) అంటూ ‘‘పుష్ప సినిమాలోని డైలాగ్స్‌ని వినండని బీజేపీ వర్కర్స్‌కి ఛాలెంజ్ చేశాడు. ఇది రాజకీయంగా అగ్గిరాజేసింది. బీజేపీ వర్గాలకు కోపమొచ్చి, తిరిగి కౌంటర్లు వేయడం మొదలుపెట్టారు. మనోజ్ తివారీ వ్యాఖ్యలకు వెస్ట్ బెంగాల్ బీజేపీ స్టేట్ సెక్రటరీ అయిన ఉమేష్ రాయ్ కౌంటర్ ఇస్తూ.. మొత్తం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం పుష్ప సినిమాలాగా ఉందని, తివారీ స్టేట్మెంట్స్ ఆ పార్టీ క్యారెక్టర్‌ని నిర్దేశిస్తాయమని మండిపడ్డారు. ఎర్రచందనం స్మగ్లర్ చెప్పినట్టుగా తివారీ చెప్పాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Prabhas: అలా కనిపించాడు కాబట్టే ప్రభాస్ ఫాన్స్ లో ఆ సంతోషం
ఉమేశ్ రాయ్‌తో బీజేపీకి చెందిన ఇతర నేతల నుంచి కూడా తివారీ వ్యాఖ్యలపై కౌంటర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తివారీ క్షమాపణలు చెప్పాడు. ర్యాలీలో భాగంగానే ఓ మీడియా ప్రతినిధి తనపై వస్తున్న విమర్శల గురించి ప్రశ్నించగా.. తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని, అందుకు తాను సారీ చెప్తున్నానని అన్నాడు. మరి, ఇక్కడితో ఈ వివాదం చల్లారుతుందా? లేక బీజేపీ శ్రేణుల నుంచి వ్యతిరేకత కొనసాగుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!
Donkey Gift: గాడిదను గిప్ట్‌గా ఇచ్చిన భర్త.. భార్య ఏం చేసిందంటే..