ఏపీకి గుడ్‌న్యూస్.. పూర్తిగా తప్పిన తుపాన్ ముప్పు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌కు…జొవాద్ తుపాను ముప్పు తప్పింది. కోస్తాంధ్ర తీరానికి దగ్గర వచ్చినట్లే వచ్చి…దిశ మార్చుకున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. జొవాద్ ప్రభావంతో ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయ్. మరోవైపు తుపాను ప్రభావంతో…దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విశాఖకు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు, గోపాల్ పూర్ కు 310 కి.మీ దూరంలో జవాద్ తుపాను కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చిన అనంతరం దిశ మార్చుకుందని వివరించింది.
తుపాను ప్రస్తుతం మందగమనంతో ఒడిశా వైపు కదులుతోందని వెల్లడించింది. గడచిన 6గంటలుగా ఇది గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్టు చెప్పింది.కొద్ది గంటల్లోనే ఇది తీవ్ర వాయుగుండంగా బలహీనపడే సూచనలు ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. ఇదే వేగంతో కదులుతూ…ఇవాళ మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ తీరానికి చేరువగా వెళ్లే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది. తదుపరి మరింత బలహీనపడి పశ్చిమ్ బెంగాల్ వైపుగా కదిలే సూచనలు ఉన్నాయ్. తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర తీరప్రాంతాల్లో గంటకు 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
Also Read
జొవాద్ తుపాను ప్రభావంతో…ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయ్. జవాద్ తుపాను తీవ్రత దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. భువనేశ్వర్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, పూరి- తిరుపతి ఎక్స్‌ప్రెస్, పలాస -విశాఖపట్నం, కిరండోల్- విశాఖపట్నం, తిరుపతి -హౌరా ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-విశాఖ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ -తిరుపతి ఎక్స్‌ప్రెస్, హౌరా-తిరుచిరాపల్లి ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ – బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేసినట్టు రైల్వేశాఖ వెల్లడించింది.
తాజావార్తలు
-
Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
-
No Release Date : ఈ సినిమాలు వచ్చేది ఎప్పుడు.. అసలు వస్తాయా?
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!