Prabhas : రెబెల్ స్టార్ ఫౌజీ.. ఆ సీన్స్ మాములుగా ఉండవట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ చిత్రాలలో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ ఒకటి. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ప్రభాస్ బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ ఆర్మీ సైనికుడిగా కనిపించనున్నాడు. అయితే, హను రాఘవపూడి ‘సీతారామం’ వంటి క్లాసిక్ లవ్ స్టోరీలను తెరకెక్కించడంలో దిట్ట. ఇప్పుడు ఫౌజీ కూడా అలాగే ఉండబోతుందని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా యుద్ధంలో పుట్టిన ప్రేమకథగా రానుందని ముందు నుంచి ప్రచారంలో ఉంది.
లేటెస్ట్గా.. సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్లో వచ్చే యాక్షన్‌తో పాటు.. ప్రభాస్, హీరోయిన్ ఇమాన్వి మధ్య వచ్చే రొమాన్స్ మరియు ఎమోషనల్ లవ్ స్టోరీ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని చిత్ర యూనిట్ వర్గాల సమాచారం. యాక్షన్, ఎమోషన్, రొమాన్స్‌ను సమపాళ్లలో కలిపి హను రాఘవపూడి ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారట. ముఖ్యంగా ప్రభాస్ సైనికుడి లుక్ మాత్రం మామూలుగా ఉండదని టాక్. ఇప్పటి వరకు ప్రభాస్ ఇలాంటి పాత్రలో కనిపించలేదు. దీంతో.. ఫౌజీ రాక కోసం వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు రెబల్ స్టార్ అభిమానులు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. అయితే, త్వరలోనే మిగిలిన షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసి, ఈ ఏడాది డిసెంబర్ చివరి వారంలో ఫౌజీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 3న ఈ సినిమా థియేటర్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరి ‘ఫౌజీ’తో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి!
Also Read
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!