ఉద్యోగుల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సీపీఎస్ రద్దు పై వేగం పెంచింది. సీపీఎస్ రద్దు అంశంపై సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయం బ్లాక్ వన్ లో సమావేశం జరిగింది. ఈ భేటీకి ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అధికారులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. సీపీఎస్ స్కీమ్ పై సీఎం జగన్ కు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు అధికారులు.
ఏప్రియల్ 4 నుంచి ప్రారంభం కానున్నాయి సీపీఎస్ రద్దు పై ప్రభుత్వ, ఉద్యోగ సంఘాల చర్చలు. పీఆర్సీ అంశం పై ఇప్పటికే ఉన్న మంత్రి వర్గ ఉప సంఘం. ఈ కమిటీ, అధికారులు కలిసి ఉద్యోగ సంఘాల నాయకులతో కసరత్తు ప్రారంభించాలని ఆదేశించారు సీఎం జగన్. సీపీఎస్ రద్దు పథకాన్ని ఉద్యోగ సంఘాల నేతలకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాలని ఆదేశించారు సీఎం జగన్. అనంతరం చర్చల ప్రక్రియ చేపట్టాలని సూచించారు సీఎం జగన్. సుదీర్ఘంగా జరిగిన సమావేశం తర్వాత వచ్చేనెలలో సీపీఎస్ రద్దుకి సంబంధించి సానుకూల ఫలితాలు రావాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.