ఉద్యోగుల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సీపీఎస్ రద్దు పై వేగం పెంచింది. సీపీఎస్ రద్దు అంశంపై సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయం బ్లాక్ వన్ లో సమావేశం జరిగింది. ఈ భేటీకి ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అధికారులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. సీపీఎస్ స్కీమ్ పై సీఎం జగన్ కు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు అధికారులు. ఏప్రియల్ 4 నుంచి ప్రారంభం…