సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మాట వాస్తవమే అని మరోసారి స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. శాసనమండలిలో సీపీఎస్ రద్దు పై వాయిదా తీర్మానం ఇచ్చారు పీడీఎఫ్ సభ్యులు.. ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు మండలి చైర్మన్ రాజు.. అయితే, ఉపాధ్యాయులపై నమోదు చేసిన కేసులుపై పీడీఎఫ్ సభ్యులు పట్టుబట్టారు.. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తామని చెప్పటం ధర్మమేనా…? అని ప్రశ్నించారు.. సీపీఎస్ ను రద్దు…
ఉపాధ్యాయులు, ఉద్యోగుల పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఇచ్చిన హామీలను నేరవేర్చమంటే అరెస్టులతో వేధిస్తున్నారా.?తాడేపల్లి ప్రాంతమంతా ముళ్ల కంచెలతో కాశ్మీర్ బార్డర్ ను తలపిస్తోంది. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్న దాహంతో ఎన్నికల్లో గెలవడానికి కన్నూమిన్నూ కానకుండా హామీలిచ్చారు. ప్రచారంలో చిటికెలేసి అన్ని సభల్లో వారంలో రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్నారు. ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి మర్చిపోయినా.. నమ్మిన ఉద్యోగులు మర్చిపోలేదు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలి. జగన్ చేసిన…
ఉద్యోగుల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సీపీఎస్ రద్దు పై వేగం పెంచింది. సీపీఎస్ రద్దు అంశంపై సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయం బ్లాక్ వన్ లో సమావేశం జరిగింది. ఈ భేటీకి ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అధికారులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. సీపీఎస్ స్కీమ్ పై సీఎం జగన్ కు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు అధికారులు. ఏప్రియల్ 4 నుంచి ప్రారంభం…