CPI Ramakrishna: మొంథా తుఫాను వల్ల తీవ్ర పంట నష్టం జరిగింది అని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గిట్టుబాటు ధరలు లేక అనేక ఇబ్బందులు పడుతున్న రైతులకు తుపాను శాపం.. రైతుల కష్టాలు తీర్చటంలో చంద్రబాబు సర్కార్ విఫలం.. బుడమేరు వరద సమయం లో చంద్రబాబు ఇచ్చిన హామీలు బుట్ట దాఖలు అయ్యాయి.. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వలేదన్నారు. సత్యసాయి జయంతి ఉత్సవాలకు మంత్రుల కమిటీ ఏర్పాటు హాస్యాస్పదంగా ఉందన్నారు. బాబా జయంతి వేడుకల కోసం సత్యసాయి ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది.. మంత్రులకు పనీ పాటా లేనట్టు ఉందని సీపీఐ రామకృష్ణ అన్నారు.
Read Also: Mamta Kulkarni: దావూద్ ఇబ్రహీం ఉగ్రవాది కాదు.. మాజీ హీరోయిన్, సన్యాసి సంచలన వ్యాఖ్యలు..
అయితే, చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తుఫాను బాధితులను ఆదుకోండి అని సీపీఐ రామకృష్ణ సవాల్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు కబ్జాకోరులుగా మారిపోయారు.. ఎమ్మెల్యేల కబ్జాలపై ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోలేదు అని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పట్టిందని ఆయన విమర్శలు గుప్పించారు. నారా లోకేష్ రెడ్ బుక్ లో టీడీపీ నేతల దాష్టీకాలు కనపడవా?.. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంలో పవన్ కళ్యాణ్ విఫలం అయ్యారు. సీజ్ ది షిప్ అన్నారు.. కనీసం ఒక్క ఆటో కూడా సీజ్ చేయలేకపోయారని రామకృష్ణ మండిపడ్డారు.