Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cpi Leader Narayana Fires On Ysrcp Over Pawan Kalyan Vizag Tour Issue

CPI Narayana: పవన్ కల్యాణ్‌ను అడ్డుకుని రగడ.. ఇది ఆయనకే మంచిది..!

Published Date :October 17, 2022 , 4:38 pm
By Sudhakar Ravula
CPI Narayana: పవన్ కల్యాణ్‌ను అడ్డుకుని రగడ.. ఇది ఆయనకే మంచిది..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటన నేపథ్యంలో విశాఖపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి… పవన్‌ వైజాగ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి.. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యే వరకు ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండడంతో జనవాణి కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు. విశాఖలో పోలీసులు యాక్ట్ అమల్లో ఉందని ఎలాంటి ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించవద్దని పోలీసులు పవన్ కల్యాణ్‌కు నోటీసులు అందించారు. అంతేకాదు.. నోవాటెల్ హోటల్ నుంచి బయటకు రాకుండా పవన్‌ కల్యాణ్‌పై పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే, ఇదంతా పవన్‌ కల్యాణ్‌కే మంచి చేస్తుందంటున్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్‌ యాత్రను అడ్డుకుని రగడ సృష్టించారని మండిపడ్డారు.. వైసీపీ పోతపాలు, కృత్రిమ ఉద్యమం విఫలం అయ్యిందంటూ విశాఖ గర్జనపై సెటైర్లు వేసిన ఆయన.. పవన్ ను టార్గెట్ చేసి జనసైనికులను రెచ్చ గొట్టారని ఆరోపించారు..

Read Also: Pawan Kalyan: 115 మంది జనసైనికులపై హత్యాయత్నం కేసులు.. హైకోర్టుకు వెళ్తాం..

విశాఖ గర్జన జరిగింది.. పవన్ కల్యాణ్ మీటింగ్‌ ఆపేశారు.. అయినా పవన్‌కే మంచి జరిగిందన్నారు నారాయణ.. మరోవైపు.. రైతుల పాదయాత్రకు మద్దతుగా వెళ్తున్న ముస్లిం సంఘాల నేతలను అడ్డుకోవడం సరికాదని హితవుపలికారు.. రైతులకు మద్దతుగా వెళ్తున్నవారు కత్తులతో వెళ్లడం లేదు కదా? అని ప్రశ్నించారు.. ఇక, అమరావతి విషయంలో వైఎస్‌ జగన్ మాట తప్పి మోసం చేశాడని మండిపడ్డారు.. దున్నపోతు మీద వర్షం పడినట్టు వుంది జగన్ పాలన అని ఎద్దేవా చేశారు నారాయణ.. మరోవైపు.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదని 600 రోజులుగా ఉద్యమం జరుగుతుంది.. విశాఖ ఉక్కుపై కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ.. వైసీపీ ఎంపీలు విశాఖ ఉక్కుపై ప్రధాని వద్ద ప్రస్తావన తీసుకురావట్లేదు అని విమర్శించారు. వైసీపీ ఎంపీలు దద్దమ్మల్లా మారిపోయారని ఫైర్‌ అయ్యారు.

ఉత్తరాంధ్రపై మాట్లాడుతున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, మంత్రులది కపట ప్రేమ అని ఆరోపించారు రామకృష్ణ.. విశాఖ రైల్వే జోన్ ఇవ్వకుండా కేంద్రం నెట్టుకోస్తుందన్న ఆయన.. రాష్ట్రంలో నియంతృత్వ ధోరణి నడుస్తుందన్నారు.. వైసీపీ ప్రజా ప్రభుత్వమా..? పోలీస్ ప్రభుత్వమా? అని నిలదీశారు.. పోలీసులు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏజెంట్లుగా మారిపోయారని ఫైర్‌ అయ్యారు రామకృష్ణ.. కాగా, విశాఖ పర్యటన ముగించుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.. సాయంత్రం జనసేన హెడ్‌ క్వార్టర్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cpi
  • janasena
  • narayana
  • Pawan Kalyan Vizag Tour

తాజావార్తలు

  • Babar Azam: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన బాబర్ ఆజామ్.. టీ20 క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం

  • Kerala Elections 2026: కేరళలో భారీగా పోలింగ్ నమోదు.. ఇది దేనికి సంకేతం..!

  • Chain Snatching: చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న రిటైర్డ్ ఆర్మీ అధికారి.. అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు

  • Melania Trump: “నా పరువు తీస్తున్నారు”.. ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై ట్రంప్ భార్య సంచలన ప్రకటన..

  • MonaLisa: మహాకుంభమేళ ‘వైరల్ గర్ల్’ మోనాలిసా ప్రేమ పెళ్లిలో కీలక మలుపు.. భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions