మాజీ డ్రైవర్ హత్య కేసులో నిందితడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే.. డీఫాల్ట్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు అనంతబాబు. గతంలో విచారణకువచ్చిన సమయంలో ప్రతి వాదులకు నోటీసులు జారీ చేశారు. నిన్న జరిగిన విచారణలో బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది అత్యున్నత న్యాయస్థానం.. అయితే, బెయిల్ షరతులపై కింది కోర్టు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.. అనంతబాబు బెయిల్ పిటిషన్‌ను రాజమండ్రిలోని ఎస్సీ ఎస్టీ…
మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబును గతనెల 23న అరెస్ట్ చేశారు పోలీసులు… అప్పటి నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో రిమాండ్‌లో ఉన్నారు.. ఇవాళ్టితో ఆయన రిమాండ్ ముగియడంతో ఆయనను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు… భద్రతా కారణాల దృష్ట్యా ఆయనకు ఎస్కార్ట్ కల్పించలేమని జడ్జికి విన్నవించారు పోలీసులు… దాంతో అనంతబాబును ఆన్‌లైన్‌లో మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు… అయితే, జులై 1వ తేదీ వరకు మెజిస్ట్రేట్ రిమాండ్ ను పొడిగించారు……