Nellore Rotten Meat Seize: నెల్లూరులో నాన్ వెజ్ కొంటున్నారా? బాబోయ్ ఇది తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాన్ వెజ్ ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్.. నెల్లూరు నగరంలో భారీగా కల్తీ మాంసం పట్టుబడింది. తమిళనాడు నుంచి లివర్, కందనకాయల వ్యర్థాలను తక్కువ ధరకు తెచ్చి ఇక్కడ అమ్మేస్తున్నారు. నెల్లూరులో చికెన్ ధరకే విక్రయాలు సాగిస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఐస్‌క్రీమ్ వాహనాల్లో తరలిస్తూ భారీగా చికెన్, మటన్ పట్టుబడింది. ఆరోగ్యశాఖ అధికారులు 400 కేజీలు పట్టుకున్నారంటే ఈ చికెన్ దందా ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.. ఇదంతా మూడునాలుగురోజుల క్రితం మాంసంగా గుర్తించారు.
కొంత కాలం క్రితం నిరంతరం నిఘాతో మున్సిపల్ హెల్త్ అధికారుల దాడులతో ఇలాంటి అమ్మకాలు సద్దుమణిగాయి. మళ్ళీ పుంజుకున్నాయి. మున్సిపల్ హెల్త్ అధికారుల దాడుల్లో నిల్వ ఉంచిన చికెన్‌తో పాటు లివర్, కందనకాయలు చెన్నై నుంచి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి విక్రయాలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఓ ముఠా చెన్నై నుంచి నెల్లూరుకు భారీగా చికెన్ లివర్, కందనకాయలను దిగుమతి చేయడం వెలుగులోకి వచ్చింది. నెల్లూరులోని చికెన్ స్టాల్స్, హోటల్స్, రెస్టారెంట్‌లకు వీటిని విక్రయిస్తుంటారు. కేవలం రూ.30 నుంచి రూ.40లకే అక్కడ దొరికే లివర్, కందనకాయలు తీసుకొచ్చి చికెన్ ధరలకు విక్రయిస్తారు.
Also Read
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
- Heart Attack: డోన్‌లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
Read Also: Extramarital Affair: సోదరుడితో భార్య ఎఫైర్.. వింత పని చేసిన భర్త
తమిళనాడులో నిల్వ ఉంచిన ఆహారాన్ని నెల్లూరుకు గుట్టుచప్పుడు కాకుండా వివిధ వాహనాల్లో దిగుమతి చేసుకుంటున్నారు. నెల్లూరుతో పాటు ఒంగోలు, గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు సైతం ఈ మాంసం తరలివెళుతుంది. విస్తృత తనిఖీలు అవసరం అనీ, ఇలాంటి మాంసం, మటన్ తింటే ఆరోగ్యం పాడవడం ఖాయం అంటున్నారు. మైపాడుగేటు వేణుగోపాల్‌నగర్‌లో ఉన్న ఓ చికెన్ స్టాల్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిల్వ ఉంచిన చికెన్ లివర్, కందనకాయలను ఆరిఫ్ అనే వ్యక్తి ఓ ఐస్‌క్రీమ్ వాహనం నుంచి దిగుమతి చేసుకుంటుండగా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంటకరమణ తనిఖీలు చేశారు. గతంలో వెంకటరమణ బృందం తనిఖీలు చేసింది.
మళ్లీ ఇప్పుడు తనిఖీలు ముమ్మరం కావడంతో వ్యాపారుల వెన్నులో వణుకు ప్రారంభం అయింది. ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో ముక్కలేనిదే ముద్ద దిగనివారికి ఈ తనిఖీలు షాకిచ్చాయి. తాము ఇలాంటి ఆహారం తింటున్నామా అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అనారోగ్యం కలిగించే ఆహారాన్ని ఎవరైనా విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు హెచ్చరించారు. చికెన్ స్టాల్‌కు నోటీసులు జారీ చేసి, రూ.25 వేలు జరిమానా విధించారు. చికెన్, మటన్ కొనేముందు అన్నీ ఆలోచించి కొనుగోలు చేయాలని, అనుమానం వస్తే తమకు ఫిర్యాదు చేయాలని హెల్త్ అధికారులు కోరుతున్నారు.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
తాజావార్తలు
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!