Extramarital Affair: రాను రాను మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. వావీ వరసలు లేకుండా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. తాజాగా ఒక వివాహిత.. తన మరిదితోనే వివాహేతర సంబంధం పెట్టుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన భర్త.. అందరిలా కోపాద్రిక్తుడు అవ్వకుండా, ఒక వింత పని చేశాడు. వారిద్దరికీ వివాహం జరిపించాడు. అవును, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
శాంతిపుర్‌లో నివసించే అమూల్యా దేబ్‌నాథ్‌కు 24 సంవత్సరాల క్రితం బబ్లా ప్రాంతానికి చెందిన దీపాలీ దేబ్‌నాథ్‌తో వివాహం జరిగింది. పెళ్లయినప్పటి నుంచి ఈ జంట తమ దాంప్యత జీవితాన్ని అన్యోన్యంగా కొనసాగించింది. సాధారణంగా భార్యాభర్తల మధ్య ఏర్పడే చిన్న చిన్న గొడవలు మినహాయిస్తే.. మరీ విడిపోయేంత పెద్ద వివాదాలేమీ ఈ జంట మధ్య లేవు. వీరి ప్రేమకు చిహ్నంగా 22 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అతనికి కూడా కొన్నాళ్ల క్రితం పెళ్లయ్యింది. కట్ చేస్తే.. కొన్ని రోజుల నుంచి కోడలు తన పుట్టింట్లోనే ఉంటోంది. మరోవైపు.. దీపాలీ భర్త అమూల్యా వృత్తిరీత్యా వేరే రాష్ట్రంలో ఎక్కువగా ఉంటున్నాడు. అటు.. కొడుకు కూడా ఉదయం ఉద్యోగానికి వెళ్లి, రాత్రి వరకు ఇంటికి రాడు.
ఈ తరుణేంలోనే దీపాలీ తన భర్త సోదరుడు కిశబ్ దేబ్‌నాథ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్నాళ్ల పాటు ఎవ్వరికీ అనుమానం రాకుండా.. గుట్టుగా తమ తతంగం కొనసాగించారు. అయితే, ఈ విషయం భర్తకు తెలిసింది. కానీ, నిరూపించేందుకు సాక్ష్యాలు లేకపోవడంతో, సరైన సమయం కోసం వేచి చూశాడు. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చేసింది. ఇద్దరూ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. సాక్ష్యాలతో సహా ఈ విషయాన్ని గ్రామస్థులకు తెలియజేశాడు. అనంతరం ఇరుగు పొరుగు సమక్షంలో.. తన సోదరుడికి భార్యనిచ్చి వివాహం జరిపించాడు.