Constable Fake Notes Case Filed In Kurnool: ‘చెప్పేవి శ్రీరంగనీతులు, చేసేవన్ని పనికిమాలిన పనులు’ అన్నట్టు.. కొందరు పోలీసు అధికారులు తమ ఖాకీ దుస్తుల్ని అడ్డం పెట్టుకొని అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. ఇప్పుడు ఓ కానిస్టేబుల్ కూడా దొంగనోట్ల చలామణి కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. ఒక అసలు నోటుకి మూడు నకిలీ నోట్లు ఇస్తానంటూ.. రాజకీయ నేతల నుంచి ఏకంగా రూ.30 లక్షలు తీసుకున్నాడు. అయితే.. ఆ కానిస్టేబుల్ నకిలీ నోట్లను ఇవ్వడంలో విఫలం అవ్వడంతో, స్టోరీ మరో మలుపు తీసుకుంది. అతడ్ని కిడ్నాప్ చేయాలని నేతలు భావించారు. ఇంతలో ఈ వ్యవహారం పైఅధికారులకి తెలియడంతో.. కథ పోలీస్ స్టేషన్‌కి చేరింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Maharastra: ఆటోలో బాలింతపై అత్యాచారం.. కడుపులో తన్నడంతో చిరిగిన కుట్లు
కర్నూలు జిల్లాలోని ఆస్పరికి చెందిన ఓ కానిస్టేబుల్.. దోంగనోట్లను చెలామణీ చేస్తున్నారు. ఈ విషయం ఆస్పరి మండలానికి చెందిన ఇద్దరు రాజకీయ నేతలకు తెలిసింది. దీంతో.. ఆ కానిస్టేబుల్‌తో వాళ్లిద్దరు ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక అసలు నోటుకి మూడు నకిలీ నోట్లు చొప్పున ఇస్తానని ఆ కానిస్టేబుల్ చెప్పాడు. దీంతో.. వాళ్లు అతనికి రూ.30 లక్షలు ఇచ్చారు. అయితే.. ఒప్పందం ప్రకారం ఆ కానిస్టేబుల్ నకిలీ నోట్లు ఇవ్వలేదు. దాంతో కోపాద్రిక్తులైన ఆ నేతలు.. కానిస్టేబుల్‌ని కిడ్నాప్ చేసి, తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఓ హత్య కేసులో రెండు రోజుల క్రితమే బెయిల్‌పై బయటకు వచ్చిన కానిస్టేబుల్‌లో కిడ్నాప్ చేయాలని పక్కా స్కెచ్ వేసుకున్నారు. ఇంతలోనే ఈ విషయం బయటకు పొక్కడంతో.. అటు, ఇటు చక్కర్లు కొడుతూ చివరికి కర్నూలు అధికారులకు తెలిసింది.
Homeguard Forgery Case: హోంగార్డు చేతివాటం.. ఫోర్జరీ సంతకాలతో నిధులు స్వాహా
దీంతో.. అధికారులు వెంటనే ఆ కానిస్టేబుల్‌ని కర్నూలుకు పిలిపించి విచారించారు. అతడిచ్చిన సమాచారం మేరకు.. ఆ రాజకీయ నేతల్ని కూడా కర్నూలుకి పిలిపించి, విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే మరో కుండబద్దలయ్యే వాస్తవం వెలుగులోకి వచ్చింది. దొంగనోట్ల వ్యవహారంలో హైదరాబాద్‌కు చెందిన గ్యాంగ్‌తోనూ సంబంధాలు ఉన్నాయని తేలింది. ఈ నేపథ్యంలోనే అధికారులు మరింత కూపీ లాగేందుకు.. లోతుగా విచారణ చేపట్టారు. అయితే.. డిపార్ట్‌మెంట్ పరువు పోతుందని రహస్యంగా విచారిస్తున్నారు.