Chinta Mohan: ఏపీలో అధికారంలోకి వస్తాం.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రంలోనే కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్… ఇవాళ తిరుపతిలో కాంగ్రెస్ పాదయాత్ర నిర్వహించింది.. కేంద్ర మాజీ మంత్రులు సుబ్బరామిరెడ్డితో కలిసి పాల్గొన్నారు చింతా మోహన్.. ఈ సందర్భంగా అంబేద్కర్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చింతామోహన్ మాట్లాడుతూ.. ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అనని గుర్తుచేశారు.. నేడు దళితులు దేవాలయాలకు, విద్యాలయాలకు వెళ్తున్నారంటే కారణం కాంగ్రెస్ పార్టీయేనన్న ఆయన.. జవహర్ లాల్ నెహ్రూ వేసిన పునాదులతో ఏపీలో అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేశారన్నారు. ఇక, రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన సాంకేతిక విప్లవం వల్ల నేడు ప్రజలందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ వారసులైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు కొడుతుంటే ఏడుపొస్తోందన్న ఆయన… 2024లో ఏపీలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది.. కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్.
Read Also: TTD: టీటీడీపై సుబ్బిరామిరెడ్డి ప్రశంసలు.. అన్యాయానికి అవకాశం లేకుండా సేవ చేస్తున్నారు..
Also Read
- Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
తాజావార్తలు
-
Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
-
AIIMS Study: వాయు కాలుష్యంతో కడుపులోని బిడ్డ ఎదుగుదలకు బ్రేక్.. ఎయిమ్స్ పరిశోధనలో షాకింగ్ విషయాలు!
-
Vaibhav Sooryavanshi: అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిన వైభవ్ సూర్యవంశీ!
-
Arjun Tendulkar విధ్వంసం.. ఆల్‌రౌండ్ షోతో వన్ మ్యాన్ షో.!
-
LENIN : అఖిల్ ‘లెనిన్’ ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!