Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్‌పాట్ కొట్టిన నటుడు… అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jeetendra: రియల్ ఎస్టేట్‌లో సరైన సమయంలో తీసుకున్న ఒక్క నిర్ణయం జీవితాన్ని ఎలా మార్చేస్తుందో చెప్పే ఉదాహరణలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అలాంటి అరుదైన కథనే తాజాగా బాలీవుడ్ లెజెండరీ నటుడు జితేంద్ర బయటపెట్టారు. ఒకప్పుడు కేవలం రూ.4.25 లక్షలకు కొనుగోలు చేసిన బంగ్లా విలువ ఇప్పుడు ఏకంగా రూ.450 కోట్లకు చేరిందని ఆయన వెల్లడించడంతో ఈ వార్త సినీ, వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించిన జితేంద్ర, పెట్టుబడిదారుడిగా కూడా ఎంత దూరదృష్టితో ఆలోచించారో ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. ‘ది రియాల్టీ డ్రైవ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జితేంద్ర తన జీవితంలోని ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు. బాలీవుడ్లో ఒకప్పుడు ‘బైజూ బావ్రా’ వంటి క్లాసిక్ చిత్రాలతో అగ్రనటుడిగా వెలుగొందిన భరత్ భూషణ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో ఉన్న తన బంగ్లాను విక్రయించాలని నిర్ణయించారు. ఆ సమయంలో జితేంద్ర తన తండ్రితో కలిసి ఆ ప్రాపర్టీని రూ.4.25 లక్షలకు కొనుగోలు చేశారు. అప్పట్లో అది పెద్ద మొత్తమే అయినప్పటికీ, భవిష్యత్తులో అది ఎంతటి విలువైన ఆస్తిగా మారుతుందో ఎవరూ ఊహించలేదు.
ఆ రోజుల్లో జితేంద్ర ఫ్యామిలీ పరిస్థితులు కూడా అంతంత మాత్రంగా ఉండేవి. ముంబైలోని ఓ వీధిలో కేవలం 20×10 అడుగుల చిన్న గదిలో ఎనిమిది మంది కుటుంబ సభ్యులతో కలిసి నివసించేవారు. అలాంటి పరిస్థితుల నుంచి 3,450 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న విశాలమైన బంగ్లాలోకి మారడం ఆయన జీవితంలో కీలక మలుపుగా నిలిచింది. అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. కొత్త ఇంటికి మారిన తర్వాత ఆయన నటించిన వరుసగా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. దీంతో ఈ ఇంటి కారణంగానే దురదృష్టం వెంటాడుతోందేమోనని భావించిన జితేంద్ర, ఆ బంగ్లాను వదిలి మరోచోటికి మారిపోయారు. కాలం మారింది. జితేంద్ర కెరీర్ మళ్లీ ఊపందుకుంది. అదే సమయంలో పాలి హిల్ ముంబైలో అత్యంత ప్రీమియం రియల్ ఎస్టేట్ ప్రాంతంగా ఎదిగింది. కొంతకాలం తర్వాత ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఆ బంగ్లా డెవెలప్మెంట్ కోసం జితేంద్రను సంప్రదించారు. అప్పుడే మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. బంగ్లాను కూల్చివేసే సమయంలో అందులో ఉపయోగించిన బర్మా టేకు కలపను విక్రయించగా దాదాపు రూ.11.5 లక్షలు వచ్చాయని జితేంద్ర వెల్లడించారు. అంటే మొత్తం ఇల్లు కొనుగోలు చేసిన ధర కంటే అందులోని కలప విలువే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా రావడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ప్రస్తుతం అదే పాలి హిల్ ప్రాంతంలోని ఈ ఆస్తి విలువ దాదాపు రూ.450 కోట్ల వరకు చేరినట్లు ఆయన తెలిపారు. ముంబైలో అత్యంత ఖరీదైన నివాస ప్రాంతాల్లో ఒకటిగా పాలి హిల్ గుర్తింపు పొందడంతో అక్కడి భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో జితేంద్ర తీసుకున్న ఆ నిర్ణయం ఆయన జీవితంలో అత్యంత లాభదాయకమైన పెట్టుబడిగా నిలిచింది. 1964లో ‘గీత్ గయా పత్థరో నే’ సినిమాతో సినీ ప్రయాణం ప్రారంభించిన జితేంద్ర, 1967లో విడుదలైన ‘ఫర్జ్’తో స్టార్ హీరోగా ఎదిగారు. తన ప్రత్యేకమైన డ్యాన్స్ స్టైల్ కారణంగా ‘జంపింగ్ జాక్’గా పేరు తెచ్చుకున్న ఆయన ఆరు దశాబ్దాల సినీ ప్రయాణంలో 200కు పైగా చిత్రాల్లో నటించారు. సినిమాలతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా దూరదృష్టి ప్రదర్శించి విజయవంతమైన వ్యక్తిగా నిలిచారు. కుమార్తె ఏక్తా కపూర్ స్థాపించిన బాలాజీ టెలిఫిలింస్ విజయంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు రూ.4.25 లక్షల పెట్టుబడి రూ.450 కోట్ల విలువైన ఆస్తిగా మారిన ఈ కథ, సరైన సమయంలో తీసుకున్న నిర్ణయం ఎంత పెద్ద ఫలితాన్ని ఇస్తుందో చెప్పే అరుదైన ఉదాహరణగా నిలుస్తోంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?