Dinesh Karthik vs Dewald Brevis: ఆ షాట్ నేర్పిస్తా.. కానీ అస్సలు ఆడొద్దు!
- లండన్ స్పిరిట్ శిబిరంలో దినేశ్ కార్తీక్
- నెట్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్, కార్తీక్ మధ్య సరదా సంభాషణ
- జూలై 23న లార్డ్స్ వేదికగా మాంచెస్టర్ జట్టుతో మ్యాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dinesh Karthik Sweet Warning to Dewald Brevis: ఇంగ్లండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ 2026 టోర్నీకి ముందు లండన్ స్పిరిట్ శిబిరంలో భారత మాజీ వికెట్‌కీపర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తీక్ చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దక్షిణాఫ్రికా యువ స్టార్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్, కార్తీక్ మధ్య నెట్స్‌లో జరిగిన సంభాషణ అభిమానులను ఆకట్టుకుంటోంది. జూలై 22న లార్డ్స్ మైదానంలో లండన్ స్పిరిట్ జట్టు సాధన చేసింది. ఈ సందర్భంగా నెట్స్‌లో బ్యాటింగ్ చేసిన బ్రెవిస్.. డీకేతో మాట్లాడాడు. తన బ్యాటింగ్‌లో కొత్త షాట్‌ను చేర్చుకోవాలని ఉందని, దాన్ని నేర్పించాలని డీకేను అతడు కోరాడు. చిన్నప్పుడు బౌలింగ్ మెషీన్‌తో సాధన చేసే సమయంలో ఆ షాట్‌ను ప్రయత్నించానని, ఇప్పుడు కార్తీక్ మార్గదర్శకత్వంలో దాన్ని పూర్తిగా నేర్చుకోవాలని ఉందని బ్రెవిస్ తెలిపాడు.
దినేశ్ కార్తీక్ ఆ షాట్‌ను తప్పకుండా నేర్పిస్తానని డెవాల్డ్ బ్రెవిస్‌కు చెప్పాడు. అయితే ఓ షరతు పెట్టాడు. ‘సమయం దొరికినప్పుడు ఆ షాట్‌ను తప్పకుండా నేర్పిస్తా. అది నీ బ్యాటింగ్‌కు మంచి ఆయుధంగా మారుతుంది. కానీ ఒకే ఒక షరతు.. ఆ షాట్‌ను ఆర్సీబీపై మాత్రం ఆడకూడదు. ఆర్సీబీ తప్ప మిగతా ఏ జట్టుపై అయినా ఆడొచ్చు. ఆ కండిషన్ ఓకే అయితే.. కలిసి ప్రాక్టీస్ చేద్దాం’ అంటూ బ్రెవిస్‌ను సరదాగా ఆటపట్టించాడు. డీకే వ్యాఖ్యలతో అక్కడున్న ఆటగాళ్లు అందరూ నవ్వులు పూయించారు.
Also Read
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
దినేశ్ కార్తీక్ వ్యాఖ్యలు అభిమానుల దృష్టిని ఆకర్షించడానికి మరో కారణం కూడా ఉంది. డెవాల్డ్ బ్రెవిస్ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతుండగా.. దినేశ్ కార్తీక్ ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్లో చెన్నై, ఆర్సీబీ మధ్య ఉండే హోరాహోరీ ప్రత్యర్థిత్వాన్ని గుర్తు చేస్తూ డీకే చేసిన ఈ సరదా వ్యాఖ్య అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. ఇటీవల చెన్నై ప్రధాన కోచ్ పదవికి కార్తీక్ పేరు వినిపించినప్పటికీ.. ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈసారి ది హండ్రెడ్‌లో లండన్ స్పిరిట్ జట్టు తమ కోచింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేసింది. ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ కోచింగ్ బృందాన్నే దాదాపు మొత్తం తీసుకొచ్చింది. ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్, బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తీక్, క్రికెట్ డైరెక్టర్ మో బొబాట్, స్కౌట్ మలోలన్ రంగరాజన్, జట్టు అనలిస్ట్ ఫ్రెడీ వైల్డ్ లండన్ స్పిరిట్‌తో కలిసి పనిచేస్తున్నారు. లండన్ స్పిరిట్ జట్టు ది హండ్రెడ్ 2026 సీజన్‌ను జూలై 23న లార్డ్స్ వేదికగా మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టుతో జరిగే మ్యాచ్‌తో ప్రారంభించనుంది. కొత్త కోచింగ్ బృందంతో ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలని లండన్ లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?