CM YS Jagan Fires On Chandrababu Naidu Over Employees Issue: విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగిన ఏపీఎన్జీఓ మహాసభల్లో టీడీపీ అధినేత చంద్రబాబుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థులు రావడం లేదని పాఠశాలల్ని, పేషెంట్లు లేరని ఆసుపత్రుల్ని, కార్మికులు రావట్లేదని ఆర్టీసీని.. చంద్రబాబు లాంటి నాయకులు మూసివేస్తారని విమర్శించారు. ఇవాళ ఏడు నియోజకవర్గాలకు ఒక కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులు ఉన్నారని.. గ్రామస్ధాయిలో సచివాలయాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం తమది అని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలకు చేరువలో తమ ప్రభుత్వం ఉందన్నారు.
Sara Ali Khan : బ్లాక్ డ్రెస్ తో అదరగొడుతున్న సారా అలీ ఖాన్..
గత ప్రభుత్వాలు గాలికి వదిలేసిన జీపీఎస్ సమస్య మీద మనసు పెట్టి నిజాయితీగా అడుగులు వేశామని సీఎం జగన్ అన్నారు. ఎంతో అధ్యయనం తరువాత జీపీఎస్ తీసుకొచ్చామని.. మాట తప్పే ఉద్దేశం లేదు కాబట్టే జీపీఎస్ తెచ్చామన్నారు. జీపీఎస్ విషయంలో చాలా సమయం కేటాయించి మంచి పరిష్కారం ఇచ్చామని.. దేశంలోనే ఈ జీపీఎస్ అమలు చేసే పరిస్ధితి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగాన్ని మూసివేయడంలో, వీఆర్ ఇవ్వకపోవడంలో, గోల్డెన్ హ్యాండ్ షేక్ అంటూ ఉద్యోగులను ఇంటికి పంపడంలో.. గత ప్రభుత్వ రికార్డ్ అని దుయ్యబట్టారు. చంద్రబాబు రాసిన మనసులో మాట పుస్తకం ఉద్యోగులందరూ ఓసారి చదవాలన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు 2.70 లక్షల్లో.. 1.09 లక్షల ఉద్యోగులు అదనంగా ఉన్నారని తేలాయని చంద్రబాబు తమ పుస్తకంలో రాశారన్నారు.
Disha Patani : సెర్బియన్ మోడల్ తో బాలీవుడ్ బ్యూటీ పీకల్లోతు ప్రేమ..?
శాశ్వత ఉద్యోగాల కాలపరిమితుల ప్రత్యామ్నాయాలను ప్రభుత్వాలు ఆలోచించాలని.. సాంఘిక సంక్షేమ ఉద్యోగాలు కాంట్రాక్టు పద్ధతిలో నియమించి, కాంట్రాక్టు ఉద్యోగులను పెంచాలని చంద్రబాబు తన పుస్తకంలో రాసుకున్నాడని సీఎం జగన్ తెలిపారు. కొత్త ఉద్యోగాలు కల్పించకూడదని చంద్రబాబు మనసులో మాట రాసుకున్నాడని.. ప్రభుత్వ ఉద్యోగుల్లో 60%కి పైగా అవినీతిపరులే ఉన్నారని పేర్కొన్నాడని చెప్పారు. ఉద్యోగులపై స్వయంగా లంచగొండి వారని రాసేస్తే.. చంద్రబాబు ఉద్యోగులకు మంచి చేయగలడా అనేది ఆలోచించుకోవాలన్నారు. శాశ్వత ఉద్యోగ నియామకాలను ఉద్దేశపూర్వకంగానే తగ్గించాడని.. 34వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబుదని గుర్తు చేశారు. 9 ఏళ్ళ పాటు 54 ప్రభుత్వరంగ సంస్ధలను అమ్మేసిన చరిత్ర చంద్రబాబుదని ఆరోపించారు.
Umair Sandhu: వేశ్యలతో పడుకున్న స్టార్ హీరో.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న లవర్
ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల పరిస్థితి చంద్రబాబు హయాంలో ఏమైందో అందరికీ తెలుసని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, మిగిలిన వారందరికీ తనపై కడుపు మంట మాత్రమే ఉందని.. వాళ్ళు చేసే రాజకీయ విమర్శలు, రెచ్చగొట్టే మాటలు, నిందలు, కట్టుకధలను నమ్మొద్దని ప్రజల్ని కోరారు. అంగళ్ళులో పోలీసుల మీద దాడి చేసి, ఒక పోలీసు కన్ను పోగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతిచ్చిన దారిలో వెళ్లకుండా.. పోలీసుల మీద దాడి చేసి, శవరాజకీయాలు చేయడానికి కూడా చంద్రబాబు వెనకాడలేదని మండిపడ్డారు. జూలై 2022 డీఏను దసరా పండుగనాడు ఇస్తున్నామని.. మెడికల్ డిపార్ట్మెంట్ మాదిరిగా అడిషనల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తున్నామని సీఎం జగన్ శుభవార్త తెలియజేశారు. ఉద్యోగులపై తమ అభిమానం ఎప్పటికీ ఉంటుందన్నారు.